అమరావతి చేరుకున్న లోకేశ్, భువనేశ్వరి
– అభిమానుల ఘన స్వాగతం
గన్నవరం
తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్, చంద్రబాబు సతీమణి భువనేశ్వరి అమరావతి చేరుకున్నారు. గన్నవరం విమానాశ్రయంలో లోకేశ్, భువనేశ్వరిలకు పార్టీ నేతలు ఘన స్వాగతం పలికారు. గన్నవరం
అభ్యర్థి యార్లగడ్డ వెంకట్రావు, పెద్దకూరపాడు అభ్యర్థి భాష్యం ప్రవీణ్ తదితరులు పుష్పగుచ్చం అందించి ఆహ్వానించారు. గన్నవరం విమానాశ్రయం నుంచి లోకేశ్, భువనేశ్వరి కుటుంబసభ్యులు ఉండవల్లిలోని తమ
నివాసానికి బయలుదేరి వెళ్లారు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు కూటమికి అనుకూలంగా రావడంతో పార్టీ శ్రేణుల్లో జోష్ కనిపిస్తోంది. పోలింగ్ ముగిశాక హైదరాబాద్ మీదుగా విదేశీ పర్యటనకు వెళ్లిన చంద్రబాబు దాదాపు మూడు
వారాలు తరువాత అమరావతి తిరిగి వచ్చారు. నేడు లోకేశ్, భువనేశ్వరి ఆంధ్రప్రదేశ్ చేరుకున్నారు. అటు తెలుగుదేశం కేంద్ర కార్యాలయం ఎన్టీఆర్ భవన్ విద్యుత్ కాంతులతో ధగధగలాడింది. ఎగ్జిట్ పోల్ ఫలితాలు
తెలుగుదేశానికి అనుకూలంగా రావటంతో యువత కేరింతలు కొట్టారు.