Sunday, September 8, 2024

ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏ 14గా లోకేష్

- Advertisement -

చంద్రబాబు పిటీషన్లు వాయిదా

విజయవాడ, సెప్టెంబర్ 26: మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు పిటిషన్‌లపై విచారణ బుధవారినికి వాయిదా పడింది. చంద్రబాబు కస్టడీ, బెయిల్ పిటిషన్‌లపై విచారణ నేడు జరగాల్సి ఉంది. ఏసీబీ కోర్టు న్యాయమూర్తి సెలవుపై ఉండటంతో విచారణ రేపటికి వాయిదా పడింది. సీఐడీ కస్టడి పొడిగింపు పిటిషన్‌పై చంద్రబాబు తరపు న్యాయవాదులు దూబే, దమ్మాలపాటి శ్రీనివాస్ కౌంటర్ దాఖలు చేశారు. కేసు విచారణను ఇన్‌చార్జి న్యాయమూర్తి రేపటికి వాయిదా వేశారు. కాగా, బెయిల్ పిటిషన్ అంశాన్ని చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావించగా.. రేపు కోర్టులో కోరాలని న్యాయమూర్తి సూచించారు.

మరోవైపు, నేడు విజయవాడ ఏసీబీ కోర్టు జడ్జి సెలవులో ఉన్నారు. దీంతో ఏసీబీ కోర్టు ఇన్‌ఛార్జి జడ్జిగా మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టు న్యాయమూర్తి వ్యవహరించారు. చంద్రబాబు బెయిల్, కస్టడీ పిటిషన్లను విచారణ చేయాలని న్యాయవాదులు ఇన్‌ఛార్జి జడ్జిని కోరారు.

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ14 గా లోకేష్

ఏపీలో ఇప్పుడు కేసులు, అరెస్టుల పర్వం నడుస్తోంది. స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఇప్పటికే అరెస్ట్ అవగా.. ఇప్పుడు నారా లోకేష్ పేరు హాట్ టాపిక్‌గా మారింది. అమరావతి ఇన్నర్ రింగ్‌ రోడ్డు కేసులో ఏ 14గా నారా లోకేష్ పేరును చేర్చింది సీఐడీ. ఏసీబీ కోర్టులో లోకేష్ పేరును మెన్షన్ చేస్తూ సీఐడీ మెమో దాఖలు చేసింది. ఐఆర్‌ఆర్‌ అలైన్‌మెంట్ స్కామ్‌లో ఇప్పటికే చంద్రబాబుపై కేసు నమోదు చేసింది సీఐడీ.. ఇప్పుడు నారా లోకేష్ పేరును కూడా చేర్చడం సంచలనంగా మారింది. ఇక ఈ కేసులో మాజీ మంత్రి నారాయణతో పాటు మరికొందరిపైనా అభియోగాలు ఉన్నాయి. వరుస కేసులతో టీడీపీ ఉక్కిరిబిక్కిరి అయిపోతుంది. మరి తదుపరి అరెస్ట్ నారా లోకేష్‌ దేనా అనేది చర్చనీయాంశంగా మారింద.

సుప్రీంకోర్టులో చంద్రబాబు పిటిషన్, బుధవారం విచారణ..

చంద్రబాబు అరెస్టు అయినప్పటి నుంచి స్కిల్ స్కామ్ కేసు నుంచి బయటపడేందుకు న్యాయపరంగా ఉన్న అన్ని అవకాశాలను ఉపయోగించుకుంటున్నారు. అయితే.. క్వాష్‌ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేయడంతో ఇప్పుడు సుప్రీంకి వెళ్లారు. చంద్రబాబు తరఫున న్యాయవాదులు దాఖలు చేసిన మెన్షన్ మెమోపై నిర్ణయం తీసుకున్న సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్.. బుధవారం విచారణ చేపడతామని తెలిపారు. కాగా, అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17ఏ ప్రకారం గవర్నర్ నుంచి ముందస్తు అనుమతి తీసుకోకుండానే స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబుపై కేసు నమోదు చేశారని, ఆ కేసును కొట్టివేయాలని కోరుతూ పిటిషన్‌లో పేర్కొన్నారు.

స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో అరెస్ట్ అయిన చంద్రబాబుకు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన తరఫున న్యాయవాదులు బెయిల్ పిటిషన్ వేయగా.. ఈ కేసులో ఇంకా విచారించాల్సిన అవసరం ఉందని, బాబును తమ కస్టడీకి ఇవ్వాలంటూ సీఐడీ తరఫున న్యాయవాదులు కస్టడీ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై విచారణను రేపటికి వాయిదా వేసింది ఏసీబీ కోర్టు. కస్టడీ పిటిషన్‌పై చంద్రబాబు లాయర్లు కౌంటర్ దాఖలు చేయగా.. దానిపై విచారణ బుధవారమే చేపడతామని స్పష్టం చేసింది కోర్టు. కాగా, స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ కేసులో ఇప్పటికే చంద్రబాబును 2 రెండు రోజుల కస్టడీకి తీసుకుంది సీఐడీ. అయితే, సరైన సమాచారం రాలేదని, ఇంకా విచారించాల్సిన అవసరం ఉందంటూ సీఐడీ మరో 5 రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలంటూ పిటిషన్ దాఖలు చేసింది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్