సమస్యల పరిష్కార వేదికగా లోకేష్ “ప్రజాదర్బార్”
రాష్ట్రం నలుమూలల నుంచి విన్నపాల వెల్లువ
అమరావ
గత ప్రభుత్వంలో ఐదేళ్ల పాటు సమస్యలు పరిష్కారం కాక అనేక ఇబ్బందులు పడ్డ సామాన్య ప్రజలు ప్రజా ప్రభుత్వంలో భరోసా కోరుకుంటున్నారు. అలాంటి వారి కోసం విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖ మంత్రి నారా లోకేష్ నిర్వహిస్తున్న “ప్రజాదర్బార్” కు మంగళగిరితో పాటు రాష్ట్రవ్యాప్తంగా ప్రజల నుంచి అనూహ్యస్పందన లభిస్తోంది. “ప్రజాదర్బార్” కు వచ్చేవారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన ప్రజలు ఉండవల్లి నివాసంలో యువనేతను నేరుగా కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. ప్రతి ఒక్కరి వినతులను స్వీకరిస్తున్న మంత్రి నారా లోకేష్.. వారికి భరోసా ఇస్తున్నారు. ఆయా సమస్యలపై సిబ్బందికి అక్కడికక్కడే ఆదేశాలు జారీ చేస్తున్నార
follow us :