మూసీ విషజలాలతో బాధపడుతున్న 40లక్షల మంది బాధితుల గోస చూడండి
మా నల్లగొండ ప్రజల ఆరోగ్యం గురించి మానవత్వంతో ఆలోచించండి
మూసి పునరుజ్జీవనం చేయాలని ఆలోచించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయం భవిష్యత్ తరాలకు మేలు చేస్తుంది
Look at the plight of the 4 million victims suffering from the toxic waters of the Musi.
ప్రజల ఆరోగ్యం కోసం చేస్తున్న మంచి పనిని ప్రతిపక్షాలు రాజకీయం చేయొద్దని విజ్ఞప్తి చేస్తున్న
అభివృద్ది,ప్రజా సంక్షేమమే మా ప్రధాన ఎజెండా..
రానున్న రోజుల్లో ఎల్బీనగర్,హయత్ నగర్ ప్రాంతం మరో కోకాపేటా కానుంది
– మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి
హయత్ నగర్:
హయత్ నగర్ సాయిబాబా టెంపుల్ (తొర్రూర్ x రోడ్) నుండి ZEE స్కూల్ వరకు సుమారు 10కోట్ల అంచనా వ్యయంతో 2లేన్ నుండి 4లేన్ రహదారిగా అభివృద్ది చేస్తున్న పనులకు శనివారం నాడు రాష్ట్ర రోడ్లు భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి గారు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో రాష్ట్ర రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్,మాజీ ఎంపీ మధుయాష్కి గౌడ్,గడ్డిఅన్నారం మార్కెట్ ఛైర్మన్ చిలుక మధుసూదన్ రెడ్డి, ఆదిభట్ల మున్సిపల్ మాజీ చైర్మన్ మర్రి నిరంజన్ రెడ్డి,ఆర్ అండ్ బి ఈఎన్సి మోహన్ నాయక్,కాంగ్రెస్ సీనియర్ నాయకులు ముద్దగోని రామ్మోహన్ గౌడ్, జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్లు రాజశేఖర్ రెడ్డి, వెంకటేశ్వర్ రెడ్డి, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు పన్యాల జైపాల్ రెడ్డి, నేలపాటి రామారావు, మెగావత్ గణేష్ నాయక్, నాయకులు గుర్రం శ్రీనివాస్ రెడ్డి, గజ్జి భాస్కర్ యాదవ్, కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు,పలువురు నాయకులు,ప్రజా ప్రతినిధులు,ఆర్ అండ్ బి అధికారులు పాల్గొన్నారు.
కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ…
పెరుగుతున్న ట్రాఫిక్ దృష్ట్యా,ప్రజా అవసరాల మేరకు పలు రోడ్ల అభివృద్ధికి శ్రీకారం చుట్టాం..
ఇవాళ హయత్ నగర్ సాయిబాబా ఆలయం నుండి ZEE స్కూల్ వరకు 4లేన్ రోడ్ గా అభివృద్ధి పనులకు 10 కోట్లతో శంకుస్థాపన చేసుకున్నాం..సోమవారం నుండి పనులు మొదలవుతాయి.
ఈ ప్రాంతంలో విద్యా,ఇతర పనుల నిమిత్తం ఎక్కువ గ్రామీణ ప్రాంతం నుండి వచ్చి స్థిరపడ్డ వారు ఎక్కువ ఉంటారు.
గతంలో హైదరాబాద్ ఎల్బీనగర్ నుండి మల్కాపూర్ రోడ్డు కోసం కృషి చేశాను..కేంద్రమంత్రి గడ్కరీ స్వయంగా కోమటి రెడ్డి కృషి వల్లే అని ఆ అంశాన్ని ప్రస్తావించారు.
ఎల్బీనగర్ నుండి హయత్ నగర్ రేడియో స్టేషన్ వరకు డబుల్ డెక్కర్ నిర్మాణం రాబోతుంది..
నాగపూర్ 8కిలోమీటర్లు తర్వాత అతిపెద్దది మన ప్రాంతంలో 6కి.మీ నిర్మిస్తున్నాం..



