- Advertisement -
శివనామస్మరణతో మారు మ్రోగిన భీమేశ్వర స్వామి ఆలయం
Lord Bhimeswara Swamy temple resounded with the name of Lord Shiva
రామచంద్రపురం,
పంచారామ క్షేత్రాల ల్లో ఒకటైన ద్రాక్షారామం శ్రీ మాణిక్యంబ సమేత భీమేశ్వర స్వామి ఆలయం కార్తీక సోమవారం నాలుగవ వారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు ఉదయం నుండే స్వామి వారి దర్శనం చేసుకోవడానికి పోటెత్తారు. స్వామివారికి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్త్రీలు సప్త గోదావరిలో స్నానాలు ఆచరించి అరటి డిప్పలపై దీపాలు వెలిగించారు. భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ఆలయ కార్య నిర్వహణ అధికారి భవాని స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షించారు. దూర ప్రాంతం నుంచి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.
- Advertisement -