గులాబీ వర్సెస్ కాంగ్రెస్
కాళేశ్వరం మంటల
హైదరాబాద్, ఫిబ్రవరి 28
మార్చి 1 నుంచి ‘చలో మేడిగడ్డ’ కార్యక్రమానికి బీఆర్ఎస్ పిలుపునిచ్చింది,మేడిగడ్డకు తామ కూడా వెళ్తామని కేసీఆర్ నల్లగొండ సభలో ప్రకటించారు. ఆయన మాటలకు తగ్గట్లుగా కేసీఆర్ షెడ్యూల్ రూపొందించారు. తెలంగాణ ఎన్నికలు వాతావరణం మంచి వేడి మీద ఉన్న సమయంలో మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోయింది. ఆ విషయాన్ని పెద్దగా హైలెట్ కాకుండా బీఆర్ఎస్ జాగ్రత్త పడింది. కానీ తర్వాత కృష్ణా జలాల అంశాన్ని బీఆర్ఎస్ అందుకోవడంతో కొంటర్ ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ మేడిగడ్డను అందుకుంది. మీడియాను..ఎమ్మెల్యేలను మేడిగడ్డకు తీసుకు వెళ్లి పగుళ్లను చూపించింది. నివేదిక ప్రకారం ఇప్పుడు రిపేర్ల చేయడం సాధ్యం కాదని.. ఆ పిల్లర్లు తొలగించి కొత్తగా నిర్మంచాల్సిందేనని నిపుణలు చెబుతున్నారు. అలాగే మరో రెండు బ్యారేజీల్లోనూ సమస్యలు ఉన్నాయని నివేదికలు వచ్చాయి. ఈ విషయంలో డాక్యుమెంట్లు ముందు పెట్టి కాంగ్రెస్ ఆరోపణలు చేస్తోంది. కాళేశ్వరంపై కాగ్ ఇచ్చిన రిపోర్ట్ .. బీఆర్ఎస్ నేతలకు మరింత ఇబ్బందికరం. కాళేశ్వరం ప్రాజెక్టు డీపీఆర్ లో 63 వేల 352 కోట్లు చూపెట్టగా.. లక్షా 6 వేల కోట్లకు అంచనా వ్యయం పెంచినట్లు కాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ఇదే సమయంలో మొత్తం ప్రాజెక్టు పూర్తయ్యే వరకు లక్షా 47 వేల 427 కోట్లు ఖర్చు అవుతుందని స్పష్టం చేసింది కాగ్. కాళేశ్వరం కోసం తెచ్చిన రుణాలలో ప్రతి ఏటా14 వేల 462 కోట్లు రుణాల చెల్లించాలని కాగ్ నివేదికలో చెప్పింది. వసరం లెకున్న 3 టీఎంసీలకు ప్రతిపాదన పెంచారని చెప్పింది. దింతో 28 వేల151 కోట్ల అదనపు వ్యయం ఏర్పడ్డదని తెలిపింది. కాళేశ్వరం నిర్వహణకు 10 వేల కోట్లు పడుతోందని తెలిపింది. ఆర్థికంగా కూడా ఏ మాత్రం లాభదాయకం కాదని.. రాష్ట్రం మొత్తానికి అవసరమైన కరెంట్ వాడాలని కూడా స్పష్టం చేసింది. కరెంట్ బిల్లులకు అయ్యే ఖర్చు కూడా వెనక్కి రాదని తెలిపింది. ఇది.. బీఆర్ఎస్ నేతల వైఫల్యాన్ని బయటపెట్టేదిలానే ఉంది. కాళేశ్వరం అంశాన్ని ఎంత కాలం లైవ్‌లో ఉంచితే తమకు అంత మేలని.. తెలంగాణను ఎలా దోచుకున్నారని అందరికీ ఎప్పటికప్పుడు గుర్తు చేసినట్లు అవుతుందని కాంగ్రెస్ నేతలంటున్నారు. కాళేశ్వరం విషయంలో మేడిగడ్డ లాంటి వైఫల్యం కళ్ల ముందే ఉన్నప్పుడు బీఆర్ఎస్ మరింత భిన్నమైన వ్యూహాన్ని పాటించాల్సి ఉంది. ఆ అంశాన్ని మరుగున పడేలా చేయాల్సిల ఉంది. కేటీఆర్ వ్యూహం ఏమిటో కానీ.. బీఆర్ఎస్ నేతలకు కూడా మేడిగడ్డ అంశాన్ని లైవ్‌లో ఉంచి సాధించుకునేదేమిటన్న సందేహం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అంటే మేడిగడ్డ ఒక్కటే కాదనేది కేటీఆర్ వాదన. ఈ విషయం పై ప్రజలకు అవగాహన కల్పించాలనుకుంటున్నారు. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డ మాత్రమే కాదని.. 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 21 పంప్ హౌజ్ లు, 203 కిలోమీటర్ల సొరంగాలు, 1,531 కిలో మీటర్ల మేర కాలువలు, 98 కిలో మీటర్ల ప్రెజర్ మెయిన్స్, 141 టిఎంసీల స్టోరేజ్ కెపాసిటీ, 530 మీటర్ల ఎత్తుకు నీళ్ల ఎత్తిపోత, 240 టీఎంసీల వినియోగం.. ఇలా అన్నింటి సమహారమే కాళేశ్వరం అని కేటీఆర్ వాదన. అందుకే అన్నీ చూపిస్తామంటున్నారు. ఎన్ని చూపించినా.. వాటి వల్ల కలిగిన ప్రయోజనం పై చర్చను కాంగ్రెస్ పెడుతుంది. ప్రతీ సారి మేడిగడ్డ పగుళ్ల అంశాన్ని హైలెట్ చేస్తుంది. ఎలా చూసినా కళేశ్వరం ప్రాజెక్టు గురించి ప్రజల్లో చర్చ పెట్టుకోవడం తెలివైన రాజకీయం ఉండదన్న వాదన సహజంగానే రాజకీయవర్గాల్లో ఉంది. అయితే కేటీఆర్ అదే కాళేశ్వరం తమకు ప్లస్ అవుతుందని అనుకుంటున్నారు. కానీ.. మేడిగడ్డ కుంగుబాటు జరగకపోతే ఆయన ప్రయత్నాల్లో కాస్త ఫలితం కనిపించేదమో కానీ ఇప్పుడు అలాంటి అవకాశం లేదన్న వాదన వినిపిస్తోంది. మార్చి ఒకటో తేదీన మరోసారి కాళేశ్వరం వ్యవహారంలో అవకతవకలు.. మేడిగడ్డ కుంగుబాటు.. అవినీతి.. అన్నీ మరోసారి చర్చకు రానున్నాయి. దీని వల్ల తమకే మేలు జరుగుతుందని కేటీఆర్ అనుకున్నట్లుగా జరిగితే బీఆర్ఎస్‌కు ఎన్నికల్లో మేలు జరుగుతుంది. రివర్స్ అయితే మరింత మైనస్ అయ్యే అవకాశం ఉంది.
గులాబీ వర్సెస్ కాంగ్రెస్
- Advertisement -
- Advertisement -