వెంకటేశ్వర్లు,సెంట్రల్ జోన్ డిసిపి
హైదరాబాద్: అశోక్ నగర్ లో స్టూడెంట్ ప్రవల్లిక ఆత్మహత్యపై దర్యాప్తు చేసామని సెంట్రల్ జోన్ డీసీపీ వెంకటేశ్వర్లు అన్నారు. వరంగల్ చెందిన ప్రవల్లిక, గ్రూప్స్ ప్రిపేర్ కోసం నగరారానికి వచ్చింది. 15 రోజులుగా హాస్టల్ లో ఉంది. ప్రవల్లిక రూమ్ మెట్ సంధ్య, అక్షయ శ్రుతి, ప్రవల్లిక రూం లో ఉన్నారు. ప్రవల్లిక మాట్లాడేది కాదు. నిన్న రాత్రి రూం లో ప్రవల్లిక సూసైడ్ చేసిందని 8:30 సమాచారం వచ్చింది. సంధ్య, ఇతర ఫ్రెండ్స్ ను విచారించాం. స్టూడెంట్స్ పొలిటికల్ లిడర్స్ ధర్నా చేశారు. అర్దరాత్రి పోస్ట్ మార్టం చేసి, ప్రవల్లిక రూం లో పంచనామా చేసాం. మృతురాలు రాసిన సూసైడ్ నోట్ ఉంది. ఆమెది మొబైల్ ఫోన్ సీజ్ చేసాం. ప్రవల్లిక అబ్బాయి తో చాటింగ్ చేసి ఉంది. శివ రామ్ రాథోడ్ అనే యువకుడి తో ప్రవలిక చాటింగ్ చేసి ఉంది. ప్రవల్లిక లవ్ సింబల్స్ తో రాసిన లెటర్స్ సీజ్ చేసాం. శుక్రవారం ఉదయం అశోక్ నగర లో ఇద్దరూ బాలాజీ దర్శన్ హోటల్ వద్ద టిఫిన్ చేశారు సీసీ కెమెరా ఫుటేజ్ సీజ్ చేసాం. అమ్మాయి ప్రవల్లికని శివ రామ్ రాథోడ్ అనే యువకుదు చీటింగ్ చేశాడని అనుమానిస్తున్నాం. వేరే అమ్మాయితో శివ రామ్ రాథోడ్ అనే యువకుడు ఎంగేజ్ మెంట్ కుదిరింది. ప్రవల్లిక తమ్ముడు ప్రణయ్ కూకట్ పల్లి లో డిగ్రీ చేస్తున్నడు.

ప్రవల్లిక పేరెంట్స్ కి కూడా తెలుసు శివ రామ్ ప్రవల్లిక ప్రేమ వ్యవహారం. లవ్ లెటర్ & సీసీ కెమెరా ఫుటేజ్ & మొబైల్ ఫోన్& పూర్తి ఎవిడెన్స్ సూసుడ్ నోట్ ఫోరెన్సిక్ ల్యాబ్ కోసం పంపామని అయన అన్నారు.
అమ్మాయి గ్రూప్స్ అప్లయ్ చేయలేదు. శివరాం రాథోడ్ పై దర్యాప్తు చేసి కేసు నమోదు చేస్తాం. శివరాం రాథోడ్ సిడిఆర్ కలెక్ట్ చేస్తాం. పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసి పూర్తి వివరాలు తెలియాజేస్తం. ధర్నా చేసి ప్రజలకు ఇబ్బందులు కలిగించిన వారిపై కేసులు నమోదు చేసామని అయన అన్నారు.


