పెదకాకాని వద్ద రైలు కింద పడి ప్రేమ జంట ఆత్మహత్య
పెదకాకాని
Love couple committed suicide by falling under the train
గుంటూరు జిల్లాలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. యువతి, యువకుడు రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నారు. పెదకాకాని వద్ద శుక్రవారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది.మృతులను దానబోయిన మహేశ్(22), నండ్రు శైలజ(21)గా గుర్తించారు.
వివరాల్లోకి వెళ్తే.. పెదకాకాని గ్రామానికి చెందిన మహేశ్, నందిగామ మండలం రుద్రవరానికి చెందిన శైలు గత కొంత కాలంగా ప్రేమించుకుంటున్నారు. డిప్లొమా చదివిన మహేశ్.. రెండేళ్ల క్రితం హైదరాబాద్‌లో ఓ మొబైల్ స్టోర్‌లో పని చేశాడు. ఆ సమయంలో అక్కడే ఉన్న శైలజతో పరిచయం ఏర్పడి ప్రేమగా మారింది. ఇటీవలే ప్రేమ విషయం ఇరు కుటుంబాలకు తెలిసింది. 10 రోజుల క్రితం యువకుడి తల్లిదండ్రులు పెళ్లికి అంగీకరించారు. యువతి కుటుంబసభ్యులు అభ్యంతరం తెలిపినట్లు సమాచారం. దసరా సమయంలో శైలు, మహేశ్ ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిపోయారు. దీంతో యువతి కుటుంబ సభ్యులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం పెదకాకాని సమీపంలో రైల్వే ట్రాక్‌పై విగత జీవులుగా కనిపించారు



