ఉద్రిక్తతకు దారి తీసిన ప్రేమ వివాహం రణరంగంగా మారిన పోలీసు స్టేషన్

- Advertisement -

ఉద్రిక్తతకు దారి తీసిన ప్రేమ వివాహం
రణరంగంగా మారిన పోలీసు స్టేషన్
వరంగల్

Love marriage leads to tension Police station turns into a battlefield

కులాంతర వివాహం అక్కడ ఊహించని ఉద్రిక్తతకు కారణమైంది. పోలీస్ స్టేషన్ ఆవరణ రణరంగంగా మారింది.. పోలీసులు చూస్తుండగానే ప్రేమజంటపై దాడి జరిగింది..యువతి బంధువులు పోలీస్ స్టేషన్ నుండి ఆ యువతిని ఈడ్చికేందుకు ప్రయత్నం చేశారు.. కానీ అప్రమత్తమైన పోలీసులు ప్రేమజంటకు రక్షణ కల్పించారు. దాడికి పాల్పడ్డ వారిపై కేసు నమోదు చేశారు.. నల్లబెల్లి పోలీస్ స్టేషన్ ఆవరణలో జరిగిన ఈ ఘటన తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది..
శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన మణిరాజ్ & నితీష అనే యువతి యువకుడు ప్రేమపెళ్లి చేసుకున్నారు.. వారం రోజుల క్రితం ప్రేమ పెళ్లి చేసుకున్న ఈ జంట నల్లబెల్లి మండలం శనిగరం గ్రామంలోని  సముద్రాల బాలరాజు అనే వ్యక్తి ఇంట్లో తలదాచుకున్నారు.
విషయం తెలుసుకున్న యువతి బంధువులు సుమారు 50 మంది శనిగరం గ్రామానికి చేరుకున్నారు.. యువతిని అక్కడి నుండి లాక్కెళ్లేందుకు ప్రయత్నం చేశారు. దాంతో ప్రేమజంట నేరుగా నల్లబెల్లి పోలీసులను ఆశ్రయించారు.
యువతి కుటుంబ సభ్యులు,  యువకుడి బంధువులతో పోలీసులు కౌన్సిలింగ్ చేయడానికి ప్రయత్నించారు ఆ  క్రమంలోనే యువతి బంధువులంతా పోలీస్ స్టేషన్ లోకి చిచ్చుకెళ్లారు. ప్రేమ జంటను నల్లబెల్లి పోలీస్ స్టేషన్ నుండి బయటకు ఈడ్చుకొచ్చి స్టేషన్ ఆవరణ లోనే విచక్షణా రహితంగా దాడి చేశారు
యువకుడి పై పొడిగిద్దులు గుద్దుతూ యువతిని లాక్కెళ్లే ప్రయత్నం చేశారు.. ఈ క్రమంలో వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని అడ్డుకున్నారు..దాడికి పాల్పడ్డ పలువురి పై కేసులు నమోదు చేశారు.. ప్రేమజంట మేజర్లు కావడంతో వాళ్లకు కౌన్సిలింగ్ చేసి ఆశ్రయం కల్పించిన పోలీసులు అక్కడి నుండి సురక్షిత ప్రాంతాలకు తరలించారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular