- Advertisement -
బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్ప పీడనం
Low pressure in Bay of Bengal in two days
ఈ నెల 11, 13 తేదీల్లో రాజధాని నగరం చెన్నైలో పలు చోట్ల కుండపోత వర్షం
చెన్నై నవంబర్ 9
బంగాళాఖాతంలో రెండు రోజుల్లో అల్ప పీడనం ఏర్పడనుందని వాతావరణ కేంద్రం అధికారులు ప్రకటించారు. ఈ అల్ప పీడనం వాయుగుండంగా మారే అవకాశాలుండటంతో రాష్ట్రంలో పలు చోట్ల చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయన్నారు. ఇదిలా ఉండగా ఈ నెల 11, 13 తేదీల్లో రాజధాని నగరం చెన్నైలో పలు చోట్ల కుండపోత వర్షం కురిసే అవకాశముందని తెలిపారు. ఇక ఈశాన్య బంగళాఖాతంలో ఏర్పడనున్న అల్ప పీడనం రెండరోజుల్లో పడమటి దిశగా శ్రీలంక తీరం వైపు నెమ్మదిగా కదులుతుందని తెలిపారు.ఈశాన్య అరేబియా సముద్రం పరిసర ప్రాంతాల్లో లక్షద్వీపాల్లో ఉపరితల ఆవర్తనం నెలకొనడటంతో కన్నియాకుమారి ), తిరునల్వేలి, తూత్తుకుడి జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. ఈ నెల 10న కడలూరు, మైలాడుదురై, నాగపట్టినం, తంజావూరు, తిరువారూరు, పుదుకోట జిల్లాల్లో భారీగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 11, 13 తేదీల్లో చెన్నై, చెంగల్పట్టు కాంచీపురం, తిరువళ్లూరు, రామనాథపురం, పుదుకోట తంజావూరు,తిరువారూరు, నాగపట్టినం, మైలాడుదురై, కడలూరు, విల్లుపురం జిల్లాల్లో, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలలోనూ పలుచోట్ల కుండపోతగా వర్షాలు కురుస్తాయన్నారు. ఈ నెల 12న కన్నియాకుమారి, తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్‌కాశి, విరుదునగర్, మదురై, శివగంగ, రామనాథపురం, తంజావూరు, తిరువారూరు, నాగపట్టినం, కడలూరు, మైలాడుదురై తదితర జిల్లాల్లో చెదురుముదురుగా వర్షాలు కురిసే అవకాశాలున్నాయని చెప్పారు.
- Advertisement -