Wednesday, March 25, 2026

మేడి గడ్డలో కాపరు డ్యామ్ నిర్మాణ పనులను చేపట్టిన L&T సంస్థ

- Advertisement -

మేడి గడ్డలో కాపరు డ్యామ్ నిర్మాణ పనులను చేపట్టిన L&T సంస్థ

 

హైదరాబాద్:ప్రతినిధి

హైదరాబాద్‌:నవంబర్ 06
తెలంగాణలో ఎన్నికలవేళ బిఆర్ఎస్ పార్టీకి తీరని కళంకం తెచ్చిపెట్టిన మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్ల కుంగడానికి ఉత్పన్నమైన ఆంశాలను శాస్త్రీయంగా అధ్యయనం చేసేందుకు నీటిపారుదల శాఖ నిపుణులు దృష్టి సారించారు.

కాపర్‌ డ్యాం నిర్మించి పిల్లర్ల అడుగుభాగం బలహీన పడేందుకు దోహదం చేసిన అంశాలను పరిశీలించి తీసుకునే చర్యలను విశ్లేషిస్తున్నారు. పిల్లర్ మధ్యలో క్రాక్‌ ఏర్పడడానికి పునాదుల బలహీనత తోపాటు నిర్మాణాలను పరిశీ లించనున్నారు.

ఈ మేరకు ఎల్లంపల్లి నుంచి అన్నారం మీదుగా వస్తున్న 30వేల క్యూసెక్కుల నీటిని ఎప్పటికప్పుడు 74 గేట్ల ద్వారా కిందికి తర లిస్తున్నారు. ప్రస్తుతం 7వ బ్లాక్‌ లోని 20 పిల్లర్‌ తోపాటు గా కుంగిన పిల్లర్ల దగ్గర ఉన్న 10 మీటర్ల లోతు నీటిని దిగువకు తరలిస్తున్నారు.

అలాగే ప్రాజెక్టు నిర్మించిన ఎల్‌ అండ్‌ టీ సంస్థకు చెందిన భారీ నిర్మాణ యంత్రాలు సంఘటన స్థలానికి తరలిస్తున్నారు. 1672 మీటర్ల పొడవున్న ఈ ప్రాజెక్టులోని 7వబ్లాక్‌ సంబంధించిన 10 వ పిల్లర్ దగ్గరకు వరదనీరు చేరుకోకుండా కాపర్‌ డ్యాం నిర్మాణం చేపట్టేందుకు అవసరమైన అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి.

కేంద్ర డ్యాంసేఫ్టీ అథారిటీ ఒకవైపు నీటిపారుదల శాఖ మరో వైపు ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుకుంటుండగానే సంబంధిత ఇంజనీరింగ్‌ నిపుణులు పనుల్లో వేగం పెంచి విధులు నిర్వహిస్తున్నారు.

సుమారు 350 మీటర్ల నుంచి 400 మీటర్ల పరిధిలో కాపర్‌ డ్యాం నిర్మించి నీటి ప్రవాహం 7వ బ్లాక్‌ కు చేరుకోకుండా కట్టడి చేసి పిల్లర్ల దగ్గర నిల్వ ఉన్న 10 మీటర్ల లోతు నీటిని పునాదులవరకు దిగువకు పంపించే ఏర్పాట్లు జరుగుతున్నాయి.

ఈ నెలా ఖరులోగా కాపర్‌ డ్యాం నిర్మాణం పూర్తి చేసి పిల్లర్లు కుంగడానికి దోహదపడ్డ అంశాలతో పాటు భారీ శబ్దం రావడానికి కారణాలను ఇంజనీరింగ్‌ నిపుణులు పరిశీలించనున్నారు.

అయితే ప్రస్తుతం ఎన్నికల అనంతరం అవసరమైతే పిల్లర్లను 100 మీటర్లు ముందుకు జరిపి తిరిగి నిర్మించడమా? లేక ఉన్న పిల్లర్లను బలోపేతం చేయడమా? అనే అంశానికి స్పష్టత రానుంది.

ప్రస్తుతంఎగువనుంచి వస్తున్న నీటిని దిగువకు పంపిస్తున్నారు, ఈ నీటిని సమ్మక్క బ్యారేజీలో నింపి అక్కడి నుంచి చెరువులు కుంటలు, పంటకాలువలకు తరలిస్తున్నారు.

నీరు సంవృద్ధిగా సమ్మక్కసాగర్‌ లో నింపిన అనంతరం అక్కడి నుంచి భద్రాచలం మీదుగా పోలవరం, ధవలేశ్వరం మీదుగా సముద్రంలో కలవనున్నాయి.

ఈ ప్రక్రియ కొనసాగిస్తూ కాపర్‌ డ్యాం నిర్మించి ఎన్నిక నియమావళి గడువు అనంతరం రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి విధాన పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు రాష్ట్ర నీటి పారుదల శాఖ పక్కా ప్రణాళికతో ముందుకు కదులుతోంది….

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్