Wednesday, January 15, 2025

పేదల కడుపు నింపే అవకాశం రావడం అదృష్టం 

- Advertisement -

పేదల కడుపు నింపే అవకాశం రావడం అదృష్టం 
ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్
తాడేపల్లిగూడెం,

Lucky to have the opportunity to fill the stomach of the poor

ఆకలితో ఉన్న పేదవారి కడుపు నింపే అవకాశం  రావడం మన అదృష్టమని  తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ పేర్కొన్నారు. తాడేపల్లిగూడెంలోని తాలూకా ఆఫీస్ కార్యాలయం సమీపంలోని అన్నా క్యాంటీన్  వద్ద  టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  అన్నదాన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా బొలిశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ గతంలో టిడిపి హయంలో పేదలకు  ఆకలి మంట ఉండకూడదని తక్కువ ధరకే భోజనం టిఫిన్ ఏర్పాటు చేసిందని కానీ వైసీపీ ప్రభుత్వం కక్షతో వాటిని నిలిపేసి పేదల కడుపు కొట్టిందన్నారు. మళ్లీ రాష్ట్రవ్యాప్తంగా కూటమి ప్రభుత్వంలో183 చోట్ల ఆగస్టు 15 నుంచి అన్నా క్యాంటీన్లో తిరిగి ప్రారంభం అవుతున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు టిడిపి నియోజకవర్గ ఇన్చార్జి వలవల బాబ్జి ఆధ్వర్యంలో ప్రతి మంగళవారం అన్నా క్యాంటీన్ వద్ద ఉచిత అన్నదానం చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి జనసేన బిజెపి నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్