- Advertisement -
మధిర ఎస్బిఐ సిరిపురం బ్రాంచ్ బ్యాంకులో చోరీ
Madhira SBI Siripuram branch bank heist
ఖమ్మం
ఖమ్మం జిల్లా మధిర పట్టణంలోని సిరిపురం ఎస్బిఐ బ్రాంచ్ బ్యాంకులో చోరీ జరిగింది. బ్యాంకు ఉద్యోగులు శుక్రవారం సాయంత్రం విధులు ముగించుకుని వెళ్లారు. శనవారం ఉదయం బ్యాంకు ను ఓపెన్ చేసేందుకు సిబ్బంది రాగా ప్రధాన ద్వారం తాళం పగలగొట్టి గ్రిల్స్ తొలగించి లాకర్ డోర్ ను ధ్వంసం చేసినట్లు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన బ్యాంకు అధికారులు పోలీసులకు సమాచారం అందించారు. స్థానిక ఎస్సై సంధ్య ఆధ్వర్యంలో విచారణ చేపట్టారు. క్లోజ్ టీం వచ్చిన తర్వాత బ్యాంకు లోకి అనుమతిస్తామని అధికారులు చెప్పారు. బ్యాంకు కార్యకలాపాలు ఆగిపోవడంతో వచ్చిన వినియోగదారులు ఇబ్బందులు పడ్డారు. చోరీ ఎంత జరిగింది అనే వివరాలను క్లూస్ టీం వచ్చిన తర్వాత వెల్లడిస్తామని అధికారులు చెబుతున్నారు.
- Advertisement -