నామినేషన్ దాఖలు చేసిన మధు యాష్కి

- Advertisement -

రంగారెడ్డి: ఎల్బీనగర్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మధు యాష్కీ గౌడ్ గురువారం నామినేషన్ దాఖలు చేశారు.  హయత్ నగర్ లో తల్లి సులోచన ఆశీస్సులు తీసుకొని, కొత్తపేట్ లోని ప్రసన్న మహంకాళి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసారు. తరువాత , తన నామినేషన్ పత్రాలను ఆర్వో కార్యాలయంలో ఎన్నికల రిటర్నింగ్ అధికారికి సమర్పించారు. మధు యాష్కి మాట్లాడుతూ యుద్ధం మొదలైంది, కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.  హయత్ నగర్ నుండి వేల సంఖ్యలో బైక్లు, కార్లతో స్వచ్ఛందంగా ర్యాలీ ప్రారంభించారు. ప్రజల గుండె నిండా మూడు రంగుల జెండా, కాంగ్రెసే వారందరికీ అండ అని అన్నారు. ఎల్బీనగర్ అంతా తిరంగమయం. ప్రత్యర్థి పార్టీల నేతలు అయోమయం. రాస్తా ఏదైనా చౌరస్తా ఏదైనా ఒకటే నినాదం. అని అన్నారు.

Madhu Yashki filed the nomination
Madhu Yashki filed the nomination

ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ ఇంచార్జ్ జక్కిడి ప్రభాకర్ రెడ్డి, మాజీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ వజీర్ ప్రకాష్ గౌడ్,తీన్మార్ మల్లన్న,న్యాయవాది చలకాని వెంకట్ యాదవ్,కాంగ్రెస్ ముఖ్య నాయకులు,మహిళా కార్యకర్తలు పాల్గొన్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular