
: కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్
సేవాదళ్ చంపాపేట డివిజన్ అధ్యక్షులుగా పుట్టగళ్ల యాదగిరి కేకే
ఎల్బీనగర్, వాయిస్ టుడే:
కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ చంపాపేట డివిజన్ అధ్యక్షులుగా పుట్టగళ్ల యాదగిరి కేకే నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎల్బీనగర్ నియోజకవర్గం చంపాపేటలోని సేవాదళ్ కార్యాలయంలో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ మిద్దెల జితేందర్ మాట్లాడుతూ రాష్ట్రంలో దుర్మార్గ పాలన కొనసాగుతుందని, కెసిఆర్ పాలనకు ప్రజలంతా విసుకుచెంది ఉన్నారని అన్నారు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా గెలుపొంది అభివృద్ధి పేరుతో బీఆర్ఎస్ పార్టీలో చేరిన ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అభివృద్ధిని పక్కనపెట్టి తన స్వలాభం కోసం పనిచేస్తున్నారని విమర్శించారు. తనను మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రజల ముందుకు రావడం విడ్డూరంగా ఉందని అన్నారు. ఎల్బీనగర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మధుయాష్కి గౌడ్ ప్రజల సమస్యలు తెలిసిన వ్యక్తి అని, మధుయాష్కి గౌడ్ ని 50వేల ఓట్ల మెజార్టీతో గెలిపించాలని ఆయన ప్రజలను కోరారు. మధుయాష్కి గౌడ్ ఎమ్మెల్యేగా గెలుపొందితే ఎల్బీనగర్ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని అన్నారు. ప్రజలంతా కాంగ్రెస్ అధికారంలోకి రావాలని ఎదురు చూస్తున్నారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రంలో, ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ గెలుపొంది అధికార పగ్గాలు చేపట్టడం ఖాయమని మిద్దెల జితేందర్ ధీమా వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు బద్రినారాయణ, గోపాల్ ముదిరాజ్, జంగయ్యగౌడ్, రఘునందన్, సురేందర్, సుజాత, గౌని అనసూయ గౌడ్, వరలక్ష్మి, సరిత, భాగ్య, అలివేలు, దాసు తదితరులు పాల్గొన్నారు.