- Advertisement -
గోదావరి నదికి మహా హారతి.
Maha Harati to Godavari river.
రామగుండం.
సమ్మక్క సారలమ్మ జాతర స్థలంలో గోదావరి తీరాన ఘనంగా గోదావరి నదిమతల్లికి మహా హారతి కార్యక్రమాన్ని బుధవారం సాయంత్రం నిర్వహించడం జరిగింది. హారతి ఉత్సవ సమితి రాష్ట్ర కో కన్వీనర్ క్యాతం వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆహ్వాన సమితి అధ్యక్షులు డా,శ్రీనివాస్ , ప్రధాన కార్యదర్శి గైనకాలజిస్ట్ డా, లక్ష్మీ వాణి గారు, డెంటిస్ట్ రమ్య చిరంజీవులు నదిమ తల్లి హారతుల కార్యక్రమం లో పాల్గొని హారతులు ఇవ్వటం జరిగింది. ఈ సందర్భంగా శాతం వెంకటరమణ మాట్లాడుతూ నదులు పూజనీయమైనవని భారతీయ సంస్కృతిలో ప్రకృతిలోని ప్రతిదీ భగవత్ స్వరూపముగా భావిస్తుంటారని ప్రాణం ఉన్నను ప్రాణం లేకపోయిననూ రాయి రప్ప చెట్టు పుట్ట ను పూజించడం భారతీయ సనాతన ధర్మంలో అంతర్భాగమని ఆ విధంగా నదీ జలాలను పూజించే సంస్కృతి రుగ్వేదము నుండి భారతీయులు అవలంబిస్తూ వస్తున్నారని ఈ విధమైన సంస్కృతి పరంపర వేల సంవత్సరాల క్రిందటనే ప్రారంభమైందని నలంద తక్షశిల లాంటి విశ్వవిద్యాలయాలు ప్రపంచానికి జ్ఞాన భిక్ష ను అందించినవని దురదృష్టవశాత్తు 800 సంవత్సరాలు మొగులుల, మరియు విదేశీ పరిపాలనలో భారతీయ సంస్కృతిని జీవన విధానాన్ని విధ్వంసం చేశాయని అన్నారు. కాస శ్రీనివాస్ గారు మాట్లాడుతూ నదిహారతుల కార్యక్రమం ఇంత బాగా నిర్వహిస్తారని అనుకోలేదని 13 సంవత్సరాలుగా నిర్విఘ్నంగా కొనసాగడం అభినందనీయమని అన్నారు. డాక్టర్ లక్ష్మీవాని గారు రమ్య గారు మాట్లాడుతూ కార్తీక మాసోత్సవంలో మహిళలు దీపారాధన చేయడం శుభప్రదమని చిన్నప్పటి నుంచి మన తల్లులు మనకు నేర్పి ఉన్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ నాయకులు ఈసంపల్లి వెంకన్న, కృష్ణమూర్తి ఉత్సవ సమితి నాయకులు నలుమాసు సత్తయ్య, తాటిపల్లి వెంకన్న, గుండ మంజుల, అంశాల వీరేశం,పొన్నం ఆంజనేయులు గౌడ్, కోడూరి రమేష్, శైలజ,రజిత, కృష్ణప్రియ, పద్మ, తదితరులు పాల్గొన్నారు. ఒజ్జల వెంకటేశ్వర శర్మ నేతృత్వంలో వేద పండితులు గోదావరి తల్లికి నక్షత్ర హారతి, కర్పూర హారతి, ధూప హారతి, ఏక హారతి ఇవ్వడం జరిగింది.
- Advertisement -