మహదేవప్పది ఆత్మహత్య కాదు కాంగ్రెస్ చేసిన హత్య
కేంద్రమంత్రి బండి సంజయ్
హైదరాబాద్
Mahadevappadi’s suicide was not a suicide, it was a murder committed by Congress: Union Minister Bandi Sanjay
నారాయణపేట జిల్లాలో మునిసిపల్ ఎన్నికలలో పోటీ చేస్తున్న మహదేవప్ప ది అత్మహత్య కాదు. కాంగ్రెస్ చేసిన హత్య. ఓటమి భయంతోనే బెదిరింపులు, అరాచకాలకు పాల్పడుతున్నారని కేంద్ర మంత్రి బండి సంజయ్ ఆరోపించారు.
కాంగ్రెస్ ను రాళ్లతో కొట్టే పరిస్థితి రాబోతోంది. మా సహనాన్ని పిరికితనంగా భావిస్తారా ? ఎన్నికల తరువాత కాంగ్రెస్ పై యుద్దం చేయబోతున్నం. బీఆర్ఎస్ అరాచకాలకు ఎదురొడ్డి పోరాడిన చరిత్ర బీజేపీ కార్యకర్తలది. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని భూస్తాపితం చేసే రోజులొచ్చాయి.బీజేపీ కార్యకర్తలారా….ధైర్యంగా ఉండండని అన్నారు.
బీజేపీ నాయకత్వం మీకు అండగా ఉంది. మహదేవప్ప కుటుంబాన్ని పరామర్శించేందుకు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రామచంద్రరావు బయలుదేరారు. మహదేవప్ప ఆత్మహత్యకు కారకులైన కాంగ్రెస్ నేతలను వెంటనే అరెస్ట్ చేయాలి. నిష్పాక్షికంగా విచారణ జరిపి దోషులను కఠినంగా శిక్షాంచాలని అన్నారు



