Thursday, February 26, 2026

అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ..

- Advertisement -

అంతరిక్షం నుంచి మహాకుంభ మేళా ..

Mahakumbha Mela from space

బెంగళూరు జనవరి 22
పన్నెండు సంవత్సరాలకు ఒకసారి జరిగే మహా కుంభమేళాకు జనం పోటెత్తుతున్నారు. 45 రోజుల పాటు సాగే కుంభమేళాలో దాదాపు 40 కోట్ల మంది పాల్గొంటారని అధికారుల అంచనా. అందు కోసం ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం భారీ ఎత్తున ఏర్పాటు చేసింది. ప్రభుత్వం టెంట్ సిటీని నిర్మించి భక్తులకు వసతి సదుపాయం కల్పించింది. సాధువుల నుంచి సామాన్యుల వరకు టెంట్లలో బస చేస్తున్నారు, వాటితో పాటు భక్తుల కోసం ప్రభుత్వం ఇతరత్రా ఏర్పాట్లు చేసింది. వాటన్నిటి కోసం చేపట్టిన నిర్మాణాలతో మహాకుంభ్ నగర్ ఒక భారీ నగరాన్ని తలపిస్తోంది. మహా కుంభమేళాకు సంబంధించి భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) తాజాగా పలు చిత్రాలు విడుదల చేసింది.అంతరిక్షం నుంచి కుంభమేళా ప్రాంతాన్ని ఉపగ్రహాలు తీసిన ఫోటోలను ఇస్రో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఆ ఫోటోల ప్రకారం, నిరుడు ఏప్రిల్‌లో ఆ ప్రాంతం నిర్మానుష్యంగా, బీడు భూములను తలపించేలా కనిపించింది. డిసెంబర్ 22న తీసిన ఫోటోల్లో ఆ ప్రాంతంలో నిర్మాణాలు ప్రత్యక్షమయ్యాయి. టెంట్ల నిర్మాణం గత డిసెంబర్‌లోనే మొదలైంది. తాత్కాలికంగా శివాలయ పార్కును కూడా అధికారులు ఏర్పాటు చేశారు. దానిలో భారతదేశ పటం కనిపించడం విశేషం. ఈ నెల 10న తీసిన ఫోటోల్లో మహా కుంభ్ నగర్‌లో నిర్మాణాలు భారీగా పెరిగిపోవడం చూడవచ్చు. మరి మూడు రోజుల్లో కుంభమేళా ప్రారంభం కానున్న నేపథ్యంలో ఈ నెల 10 నాటికే సాధువులతో పాటు సామాన్యులు పెద్ద సంఖ్యలో త్రివేణి సంగమం వద్దకు చేరుకున్నారు. కాగా, మహా కుంభ్ నగర్‌లో దాదాపు లక్షన్నర టెంట్లు నిర్మించామని, వాటిలో మూడు వేల కిచెన్‌లు, అదనంగా లక్షా 45 వేల రెస్ట్ రూమ్‌లు, 99 పార్కింగ్ లాట్‌లు ఏర్పాటు చేశామని అధికారులు తెలియజేశారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్