- Advertisement -
ఆత్మహత్య చేసుకున్న మహాలక్ష్మీ నిందితుడు
Mahalakshmi who committed suicide is accusedబెంగళూరు, సెప్టెంబర్ 25, (వాయిస్ టుడే)
బెంగళూరు వయాలీ కావల్‌లోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన నేపాలీ మహిళ మహాలక్ష్మీ కేసులో నిందితుడుగా అనుమానిస్తున్న వ్యక్తి ఆత్మహత్యకి పాల్పడ్డట్లు తెలుస్తోంది. ఈ కేసులో మూడో వ్యక్తి కోసం గాలిస్తున్న పోలీసులకు నిందితుడు ఒడిషాలో చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు సమాచారం అందింది.బెంగళూరులోని ఓ అపార్ట్‌మెంట్‌లో దారుణ హత్యకు గురైన మహాలక్ష్మీ కేసులో ప్రధాన నిందితుడుగా పోలీసులు అనుమానిస్తున్న వ్యక్తి పేరు ముక్తి రంజన్ రాయ్. ఇతడి కోసం వెస్ట్ బెంగాల్, ఒడిశా సహా ఈశాన్య రాష్ట్రాల్లో గత కొద్ది రోజులుగా పోలీసులు గాలిస్తున్నారు. ఈ క్రమంలో అతడు ఒడిశాలోని భద్రక్ జిల్లాలో ఓ చెట్టుకు ఉరేసుకొని చనిపోయినట్లు పోలీసులకు సమాచారం అందింది. నేపాలీ వివాహిత మహాలక్ష్మితో సన్నిహితంగా ఉన్న వారిలో ఇతడ్నే మొదటి నుంచి పోలీసులు నిందితుడిగా అనుమానిస్తున్నారు. ముక్తి రంజన్ సడోమా సూకిస్టిక్ అనే వ్యాధితో రగిలి పోయేవాడని పోలీసుల విచారణలో తేలింది.2019లో మహాలక్ష్మీ భర్త హేమంత్ దాస్‌తో కలిసి బతుకుదెరువు కోసం బెంగళూరు వచ్చింది. హేమంత్‌దాస్ ఓ సెల్‌ఫోన్ షాప్‌లో పనికి కుదరగా, మహాలక్ష్మీ ఓ మాల్‌లో పనిచేస్తూ ఉండేది. వీరికి ఒక బిడ్డ కూడా పుట్టింది. 2023 వరకు కలిసి ఉన్న వీళ్లు, మహాలక్ష్మీ ఉత్తరాఖండ్‌కు చెందిన హెయిర్ డ్రస్సెర్ అష్రాఫ్‌తో సన్నిహితంగా మెలగడంతో హేమంత్ దూరం అయ్యాడు. బిడ్డను ఆర్నెళ్ల క్రితం భర్త దగ్గరే వదిలి మహాలక్ష్మీ ఒంటరిగా ఉంటోంది. కొద్ది రోజుల క్రితం మహాలక్ష్మీ నివసించే నేలమంగల్ ప్లాట్ గదిలో నుంచి దుర్వాసన వస్తుండడంతో పోలీసులు వచ్చి గది తలుపులు తెరవగా హత్యోదంతం వెలుగు చూసింది. ప్రధాన నిందితుడు ముక్తిరంజన్ రాయ్ మహాలక్ష్మిని చంపిన తర్వాత ఆమెను 40 భాగాలుగా నరికి ప్రిఢ్జ్‌లో ఉంచి పారిపోయాడు. మహాలక్ష్మిని హత్యచేసింది తానేనని సూసైడ్ నోట్‌లో పేర్కొన్నాడు. పోలీసులు సూసైడ్ నోట్‌ను స్వాధీనం చేసుకున్నారు.అతని డైరీలో డెత్ నోట్ రాసి ఉన్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 3న మహాలక్ష్మి ఇంటికి వెళ్లి, ఆమెను హత్య చేసినట్లు నిందితుడు తన డైరీలో రాశాడు. అందులో ఏముందంటే..’ఆమె ప్రవర్తనతో నేను చాలా విసిగిపోయాను. ఇదే విషయమై ఆమెతో గొడవపడగా, మహాలక్ష్మి నాపై దాడి చేసింది. దీంతో కోపోద్రిక్తుడైన నేను క్షణికావేశంలో ఆమెను హత్య చేశాను. ఆమెను చంపిన తర్వాత, నేను ఆమె శరీరాన్ని 59 ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచాను. ఆమె ప్రవర్తనతో విసిగిపోయే ఈ పని చేశాను’ అని డైరీలో పేర్కొన్నాడు. హంతకుడు ముక్తిరంజన్ రాయ్ నివాసంలో సూసైడ్ నోటు దొరికినట్లు పోలీసులు తెలిపారు. ఒడిశాలోని భద్రక్ జిల్లాలోని ఓ గ్రామంలో చెట్టుకు వేలాడుతూ కనిపించాడు. ముక్తిరంజన్ బుధవారం పాండి గ్రామానికి వచ్చి తన ఇంట్లో కొంత సమయం ఉండి, ఆ తర్వాత ద్విచక్ర వాహనంపై ఇంటి నుంచి బయలుదేరిన అతడు గ్రామంలోని ఓ చెట్టుకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసు వర్గాలు తెలిపాయి సంచలనం సృష్టించిన ఈ హత్య ఘటన తర్వాత ముక్తిరంజన్ అదృశ్యమయ్యాడు. అతడి కోసం కర్ణాటక పోలీసులు నాలుగు బృందాలను ఒడిశాకు పంపారు. అయితే అతడు సెప్టెంబర్ 1 నుంచే మాల్‌కు రావడం మానేశాడు. మహాలక్ష్మి కూడా సెప్టెంబర్ 1 తర్వాత అదృశ్యమైంది. దీంతో ఆమెను సెప్టెంబర్ 2 లేదా సెప్టెంబర్ 3న మహాలక్ష్మిని హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. రెండు రోజులుగా మహాలక్ష్మి ఇంటి నుంచి దుర్వాసన వస్తుండటంతో ఇరుగుపొరుగు గమనించి బంధువులకు సమాచారం ఇవ్వడంతో గత శనివారం ఈ హతోదంతం వెలుగులోకి వచ్చింది. మహాలక్ష్మి తల్లి, సోదరి శనివారం ఆమె ఇంటికి వచ్చి చూడగా భయానక దృశ్యం వారికి కనిపించింది. మహాలక్ష్మిని హత్య చేసి, ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేసి ఫ్రిజ్‌లో ఉంచినట్లు పోలీసులు తెలిపారు. ఫ్రిజ్ వద్ద సూట్‌కేస్ కూడా దొరికింది. మహాలక్ష్మిని హత్య చేసేందుకు వినియోగించిన కత్తిలాంటి పదునైన ఆయుధం అందులో లభ్యమైంది. దీనితోనే ఆమె మృతదేహాన్ని ముక్కలు చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. త్రిపురకు చెందిన మహాలక్ష్మి అక్కడి ఓ బట్టల మాల్‌లో పనిచేసింది. ఐదు నెలలుగా నివసిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. ఆమెకు వివాహమై ఒక బిడ్డ కూడా ఉంది. అయితే భర్తతో విడిపోయి అక్కడ ఒంటరిగా ఉంటోంది.ఈ ఘటనలో తొలుత భర్త హేమంత్‌దాస్‌తో పాటు స్నేహితుడు అష్రఫ్‌ను అనుమానించిన పోలీసులకు ఆధారాలు లభించలేదు. మహాలక్ష్మీ మరో వ్యక్తితో సన్నిహితంగా ఉంటుందన్న సమాచారంపై పోలీసులు విచారణ సాగించారు. ప్రధాన నిందితుడు ముక్తిరంజన్ దాస్‌గా గుర్తించి అతడి కోసం గాలింపు చేపట్టారు. ఈశాన్య రాష్ట్రాలు, వెస్ట్ బెంగాల్ సహా ఒడిషాలో అతడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో భద్రక్ జిల్లాలో ముక్తి రంజన్ దాస్ చెట్టుకు ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులకు సమాచారం అందినట్లు తెలిసింది.కొద్ది రోజుల క్రితం నేలమంగళంలోని ప్టాల్‌లోని ఫ్రిడ్జ్‌లో గుర్తించ లేని స్థితిలో మహిళ శరీర భాగాలు లభ్యమవగా.. కర్ణాటక సర్కారు ఈ కేసును చాలా సీరియస్‌గా తీసుకొని విచారణ చేపట్టింది. చివరకు ప్రధాన నిందితుడుగా అనుమానిస్తున్న ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యతో విచారణలో అవరోధం ఏర్పడినట్లైంది. అయితే నిందితుడు ముక్తి రంజన్ రాయ్ ఆత్మహత్యకు సంబంధించి ఇంకా పోలీసులు ఏ విధమైన అధికారిక ప్రకటనా చేయలేదు.
- Advertisement -




