Sunday, September 8, 2024

మహేష్ బాబు రాజమౌళి

- Advertisement -
Mahesh Babu Rajamouli
Mahesh Babu Rajamouli

ఈ సినిమా ఆఫ్రికా అడ‌వుల నేప‌థ్యంలో ఆద్యంతం ర‌క్తి క‌ట్టించే ఎలిమెంట్స్ తో సినిమా ర‌క్తి క‌ట్టిస్తుంద‌ని ఇంత‌కుముందు క‌థ‌నాలొచ్చాయి. రచయిత వి.విజయేంద్ర ప్రసాద్ ఈ చిత్రం మూల క‌థ‌ ఆఫ్రికా అడ‌వుల్లోని నాగ‌రిక‌త ఆధారంగా కొన‌సాగుతుంద‌ని తెలిపారు.  అయితే ఈ క‌థ‌ను ఎలా ద‌క్కించుకున్నారు? అన్న‌దానికి తాజాగా స‌మాచారం అందింది. పాపుల‌ర్ అంతర్జాతీయ నవల ఆధారంగా ఈ సినిమాని రెండు భాగాలుగా రూపొందించ‌నున్నార‌ని, ఈ సిరీస్ హక్కులను పొందడం విజయవంతంగా పూర్తి చేసార‌ని సమాచారం. ప్రముఖ రచయిత విల్బర్ స్మిత్ నవలల ఆధారంగా స్క్రిప్టును మ‌లిచార‌ని కూడా తెలిసింది.

విల్బర్ స్మిత్ పాపుల‌ర్ నవలలు `ది బాలంటైన్` టైటిల్ తో ఆద్యంతం ఆస‌క్తిక‌రంగా సాగుతాయి. నవలల హక్కులను రాజమౌళి- కె.ఎల్ నారాయ‌ణ బృందం ఛేజిక్కించుకున్నార‌ని తెలిసింది. బాలంటైన్ కుటుంబ జీవితాలను ఈ న‌వ‌ల‌ల్లో స్ప‌ర్శించారు. మూడు దశాబ్దాల కాలంలో ప్రచురించిన క‌థ‌లు ఇవి. సిరీస్‌లో మొత్తం ఏడు నవలలు ఉన్నాయి. వాటి పేర్లు – ది ఫాల్కన్ ఫైల్స్, ది మెన్ అఫ్ మెన్, ది ఏంజెల్స్ వీప్, ది లేపర్డ్ హంట్స్ ఇన్ డారక్నెస్, ది ట్రింఫ్ అఫ్ సన్, కింగ్ అఫ్ కింగ్స్, కాల్ అఫ్ ది రోవెన్ – ఇలాగ వేరు, వేరు, పేర్లతో ఈ నవల్స్ చాలా అడవెంచరస్ మూడ్ లో సాగుతాయి. ప్రపంచం లో అత్యధికం గా అమ్ముడు పోయిన బుక్స్ జాబితా లో ఈ సిరీస్ ఉన్నాయి.

ఇవ్వన్నీ చూస్తుంటే, ఎప్పటిలాగే, రాజమౌళి, తన కధ ల మీద, స్క్రిప్ట్ మీద ఎంత శ్రద్ధ, డెడికేషన్ చూపిస్తారో, మనం వేరే చెప్పక్కర్లేదు.  ఈ వివరాలు అన్నీ ఇంకా కన్ఫర్మెడ్ గా తెలియాలంటే కొంత కాలం ఎదురు చూడాలి. ఏదయినా ఒకటి మాత్రం నిజం – రాజమౌళి – మహేష్ కాంబినేషన్ లో  రెండు భాగాలుగా వస్తున్న  సినిమా,  ప్రపంచ వ్యాప్తంగా విడుదల అయ్యి, తెలుగు సినిమా స్థాయి ని మరింత పెంచుతుంది అనడం లో, ఎలాంటి డౌట్ లేదు – సత్య కేశరాజు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్