అంచనాలు పెంచుతున్న మహేష్ బాబు వారణాసి
Mahesh Babu’s Varanasi is raising expectations
రాజమౌళి తెరకెక్కిస్తున్న ‘వారణాసి’ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్న సూపర్ స్టార్ మహేశ్ బాబు తర్వాతి ప్రాజెక్ట్ గురించి ఫ్యాన్స్, ట్రేడ్ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. తాజాగా విశ్వసనీయ సమాచారం ప్రకారం మహేశ్ నెక్స్ట్ సినిమా అత్యంత క్రేజీ కాంబినేషన్ లో ఫిక్స్ అయింది.మహేశ్ బాబు, సందీప్ రెడ్డి వంగా కలయికలో సినిమా తెరకెక్కబోతోంది. ఏషియన్ సినిమాస్ బ్యానర్ పై టాలీవుడ్ బడా నిర్మాత సునీల్ నారంగ్ ఈ భారీ చిత్రాన్ని నిర్మించబోతున్నారు. సినిమాకు సంబంధించి ఇప్పటికే చర్చలు ముగిసినట్లు ఫిల్మ్ నగర్ వర్గాల్లో జోరుగా ప్రచారం జరుగుతోంది.వారణాసి’ షూటింగ్ ముగిసిన వెంటనే సందీప్ వంగా సినిమా సెట్స్ పైకి వెళ్తుంది. సందీప్ ఇప్పటికే మహేశ్ కోసం ఒక పవర్ఫుల్ స్క్రిప్ట్ సిద్ధం చేశారని సమాచారం. సందీప్ వంగా తన సినిమాల్లో హీరోలను చూపించే వైల్డ్ స్టైల్, మహేశ్ బాబు క్లాస్, మాస్ అప్పీల్… వీరి కాంబినేషన్ పై అంచనాలను అమాంతం పెంచేస్తున్నాయి.



