మహేశ్వరం బీఎస్పీ అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి నామినేషన్ దాఖలు

- Advertisement -
Maheshwaram BSP candidate new Manohar Reddy nomination filed

దారిపొడువున కొత్త మనోహర్ రెడ్డికి మంగళ హారతులు

ఎల్బీనగర్, వాయిస్ టుడే:

మహేశ్వరం నియోజకవర్గం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త మనోహర్ రెడ్డి మంగళవారం కర్మన్ ఘాట్ ధ్యానాంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుండి నామినేషన్ దాఖలు చేయడానికి మహేశ్వరం మండలానికి తరలివెళ్లారు. నామినేషన్ సందర్భంగా కవులు, కళాకారులు నృత్యాలు చేస్తూ, జానపద కళాకారులు పాడిన పాటలు ఆకట్టుకున్నాయి. నామినేషన్ సందర్భంగా దారిపొడిన బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు కొత్త మనోహర్ రెడ్డికి మంగళ హారతులు పట్టి జేజేలు పలికారు. ఈ సందర్భంగా కొత్త మనోహర్ రెడ్డి మాట్లాడుతూ నియోజకవర్గంలో బడుగు, బలహీనవర్గాల ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు తనకు తెలుసునని, వాటి పరిష్కారానికి తనవంతు కృషి చేస్తానని హామీనిచ్చారు. తనను ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గంలో సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకొని దశలవారీగా పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటానని అన్నారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular