రోజుకో అత్యాచారం, గంటకో అఘాయిత్యం.. ఇదేనా మార్పు ?
మహిళా భద్రతకు అభయమివ్వని హస్తానికి అధికారమెందుకు
మంత్రి సీతక్క ను అడ్డగించి నిలదీసిన మహిళా మోర్చా రాష్ట్ర అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి
హైదరాబాద్
Mahila Morcha who intercepted and deposed Minister Sitakka is the state president
తెలంగాణ రాష్ట్రంలో ఆసిఫాబాద్ జిల్లాకి సంబంధించిన ఆదివాసీ ఆడబిడ్డపై ఆగష్టు 31 న జరిగినట్వంటి అత్యాచారం మరియు హత్య యత్నం ను ఉద్దేశించి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా మహిళలు ధర్నాలు చేపట్టాలని తెలంగాణ రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డాక్టర్ శిల్పారెడ్డి పిలుపునిచ్చారు.
దానిలో భాగంగా ఈరోజు గాంధీ హాస్పిటల్ లో ఉన్న బాధిత మహిళను పరామర్శించడానికి వెళ్లిన శిల్పారెడ్డి బాధిత కుటుంబంతో మాట్లాడి వారికి అండగా ఉంటామని భరోసనిచ్చారు . మహిళ పై జరిగింది హత్యాచారమే అని కుటుంబ సభ్యులు మీడియా సాక్షిగా చెప్పినా మంత్రి సీతక్క ఈ కేసుని పక్కతోవ పట్టించే తీరును నిరసిస్తూ మహిళకి న్యాయం జరగాలని గాంధి హాస్పిటల్ ముందు బైటాయించిన శిల్పారెడ్డి గారు బాధిత మహిళా కుటుంబానికి జరిగిన అన్యాయం ని పక్కతొవ్వ పట్టించడానికి వచ్చిన మంత్రి సీతక్క ని నీలదీసి ఈ సంఘటనను అత్యాచారం మరియు హత్య యత్నం గానే చూడాలని కమ్యూనల్ ఇష్యూ గా చిత్రికరించవద్దని సూటిగా మంత్రిని హెచ్చరించారు. వెంటనే నిందితుడికి ఎస్సీ,ఎస్టీ T అట్రాసిటీ, అత్యాచార మరియు హత్యయత్నం కేసులు పెట్టి ఉరిశిక్ష విధించి బాధిత మహిళకి న్యాయం చేకూర్చాలని లేనియెడల రాష్ట్ర మహిళా మోర్చా తరుపున ముందు ముందు చెప్పట్టపోయే కార్యక్రమాలు తీవ్రంగా ఉంటాయని శిల్పారెడ్డి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు.