27న కాంగ్రెస్ పార్టీలోకి మైనంపల్లి

- Advertisement -
Mainampally joined the Congress party on 27th
Mainampally joined the Congress party on 27th

మేడ్చల్ : కుత్బుల్లాపూర్ దూల పల్లి లోని మైనం పల్లి నివాసంలో మైనం పల్లి హనుమంతరావు తో కలిసి అల్పాహార విందు లో కాంగ్రెస్ నేతలు మాజి డిప్యూటీ సీఎం దామోదర రాజనరసింహ,మాజి ఎంపి అంజన్ కుమార్ యాదవ్ తదితరులు పాల్గోన్నారు. ఈ సందర్బంగా మైనం పల్లి హనుమంతరావు మాట్లాడుతూ  ఈ నెల 27లోపు త్వరలో కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని,నియోజక వర్గంలో చేసిన సర్వే ఆధారంగా తనకు,నా కుమారుడికి కూడా అవకాశం ఇస్తారని భావిస్తున్నామన్నారు. ఇప్పుడే తమ కార్యకర్తల పై కేసులు పెడుతున్నారని, బీ అర్ ఎస్ ప్రభుత్వంలో ప్రజాస్వామ్యం కూని అవుతుందని ఆగ్రహం  వ్యక్తం చేశారు మైనం పల్లి. తనకు పదవులు ముఖ్యం కాదని,కార్యకర్తల కోసం ప్రాణాలు ఇచ్చేందుకు సైతం వెనకాడననీ అన్నారు. మేడ్చల్,మల్కాజిగిరి,మెదక్ సీట్లు ఆశిస్తున్నట్లు తెలిపారు మైనం పల్లి. మేడ్చల్ ఎమ్మెల్యే సీటు నక్క ప్రభాకర్  గౌడ్  కు ఇవ్వాలని, నా తమ్ముడి తో సమానం అన్నారు. ఎన్ని అవాంతరాలు సృష్టించిన కాంగ్రెస్ పార్టీలో త్వరలో చేరుతున్నట్లు,నమ్ముకున్న నియోజక వర్గం ప్రజల కోసం కష్టపడతనని తెలిపారు. మైనం పల్లి ని తన నివాసం లో కలిసిన అనంతరం కాంగ్రెస్ సీనియర్ నాయకులు అంజన్ కుమార్ యాదవ్,దామోదర రాజనరసింహ మాట్లాడుతూ…కాంగ్రెస్ పార్టీ ఒక సముద్రం అని… మళ్ళీ  పూర్వ వైభవం దిశగా అడుగులు వేస్తున్నామని,సీనియర్ నాయకులు మిత్రుడు హనుమంత్ రావు ను మర్యాద పూర్వకంగా కలిసి పార్టీలోకి ఆహ్వనిస్తున్నమన్నారు. అందరం కలిసి కట్టుగా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం స్తాపిస్తమని ఆశాభావం వ్యక్తంచేశారు. త్వరలోనే డిల్లీ పెద్దలను కలిసి కాంగ్రెస్ అధినేత్రి సమక్షంలో చేరికలు ఉంటాయని తెలిపారు.ఎవరికి సీట్లు ఎక్కడ ఇవ్వాలనేది,అధిష్టానం చూసుకుంటుందని,వారు చెప్పిన మార్గంలోనే ముందుకు సాగుతామని అన్నారు.

Mainampally joined the Congress party on 27th
Mainampally joined the Congress party on 27th
- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular