అమెరికా పౌరసత్వం కోరుకునే విదేశీయులకు భారీ షాక్

- Advertisement -

అమెరికా పౌరసత్వం కోరుకునే విదేశీయులకు భారీ షాక్

Major shock for foreigners seeking US citizenship.

అమెరికా పౌరసత్వం కోసం ఎదురుచూస్తున్న విదేశీయులకు ట్రంప్ ప్రభుత్వం భారీ షాక్ ఇచ్చింది. పౌరసత్వ దరఖాస్తు ఫీజులను ఏకంగా 75 శాతం వరకు పెంచడంతో పాటు, వలసదారులకు ప్రస్తుతం అందుతున్న ఫీజు మినహాయింపులను పూర్తిగా రద్దు చేయాలని అమెరికా హోంల్యాండ్ సెక్యూరిటీ శాఖ (DHS) ప్రతిపాదించింది.

వలసల నియంత్రణపై కఠిన వైఖరిని అవలంబిస్తున్న ట్రంప్ యంత్రాంగం, చట్టబద్ధమైన పౌరసత్వ ప్రక్రియను మరింత కఠినతరం చేసే దిశగా ఈ చర్యలు చేపట్టింది. ముఖ్యంగా తక్కువ ఆదాయం కలిగిన దరఖాస్తుదారులపై ఈ మార్పులు తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది.

అమెరికా పౌరసత్వ, వలస సేవల సంస్థ (USCIS) విడుదల చేసిన ప్రతిపాదనల ప్రకారం, సాధారణ పేపర్ ఫైలింగ్ (ఫారం N-400) ఫీజు ప్రస్తుతం ఉన్న 760 డాలర్ల నుంచి 1,330 డాలర్లకు పెరగనుంది. అలాగే ఆన్‌లైన్ దరఖాస్తు ఫీజు 710 డాలర్ల నుంచి 1,280 డాలర్లకు చేరనుంది.

అదేవిధంగా, పౌరసత్వ దరఖాస్తు తిరస్కరణపై అప్పీల్ చేసేందుకు ఉపయోగించే ఫారం N-336 ఫీజును 830 డాలర్ల నుంచి 1,475 డాలర్లకు పెంచాలని ప్రతిపాదించారు. ఇది దాదాపు 77 శాతం పెరుగుదల.

ఈ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే అమెరికా పౌరసత్వం పొందాలనుకునే వేలాది మంది వలసదారులపై అదనపు ఆర్థిక భారం పడనుంది. ముఖ్యంగా భారతీయులు సహా ఇతర దేశాల నుంచి అమెరికాలో స్థిరపడాలనుకునే వారికి ఈ నిర్ణయం గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular