- Advertisement -
నియామకపు ఉత్తర్వులు జారీ చేసిన మిద్దెల జితేందర్
ఎల్బీనగర్, వాయిస్ టుడే: కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు మాకర్ల గిరికుమార్ నియమితులయ్యారు. ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర సేవాదళ్ రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ నియాకపు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన ఎల్బీనగర్ నియోజకవర్గ అధ్యక్షులు మాకర్ల గిరికుమార్ మాట్లాడుతూ ఎల్బీనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, సేవాదళ్ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానని అన్నారు. తనను అధ్యక్షులుగా నియమించిన రాష్ట్ర అధ్యక్షులు మిద్దెల జితేందర్ కు, ఇతర నేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.
- Advertisement -