రైతు పండుగను విజయవంతం చేయండి..!
Make Rythu festival a success..!
కమాన్ పూర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈర్ల సురేందర్
కమాన్ పూర్
ఈనెల , 29, 30 తేదీలలో మహబూబ్ నగర్ జిల్లా అమిస్తాపూర్ నందు జరుగు రైతు పండగ మహాసభను విజయవంతం చేయాలని కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ కార్యదర్శి ఈర్ల సురేందర్ కోరారు.
కమాన్ పూర్ మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటి కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు పండగ కార్యక్రమమును అమిస్తాపూర్, మహబూబ్ నగర్ జిల్లాలో ఈ నెల 28 నుండి 30 వరకు మూడు రోజులపాటు వ్యవసాయ ప్రదర్శనలు జరుగునని తెలిపారు. 30న సాయంత్రం రైతు పండగా మహాసభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరవుతున్నారని రైతులు ఇట్టి మహా సభని విజయవంతం చేయాలని కోరారు.
ధాన్యం ఉత్పత్తిలో దేశంలోనే మన తెలంగాణ ప్రథమ స్థానంలో ఉందని అన్నారు.
కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలో కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మూడు మండలాలు ఉన్నాయని తెలిపారు.
ఇప్పటికే రైతులకు ఇప్పటికే ఋణ మాఫీ జరిగిందని, మిగిలిన రైతులకు ఋణ మాఫీ అయ్యే విధముగా ప్రభుత్వం చర్యలు చేపట్టిన సంగతి అందరికి తెలిసిందేనాన్నారు.
ప్రభుత్వం ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మాత్రమే రైతులు తమ ధాన్యాన్ని విక్రయించాలని, ప్రభుత్వం మద్దతు ధరతో పాటు సన్నరకాలకు రూ. 500 బోనస్ కూడా రైతులకు జమ చేయడం జరుగుతుందాన్నారు.
రైతులు దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. రైతు బరోస కూడా త్వరలో జమ చేయడం జరుగుతుందని రైతులు ఎలాంటి ఆందోళన చెందవద్దని రైతుల సంక్షేమం కొరకు ప్రభుత్వం శాయ శక్తుల కృషి చేస్తుందన్నారు.
రైతుల సమస్యలు పరిష్కరించే దిశగా వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్ రావు, ఐటి, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు లు చర్యలు తీసుకుంటున్నారని వెల్లడించారు.
కమాన్ పూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పరిధిలోని మూడు మండలాలైన కమాన్ పూర్, రామగిరి, ముత్తారం మండలాల్లో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో రైతు పండుగ సంబురాలు ఘనంగా నిర్వహించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రైతు పండుగ ప్లెక్సీలను ఆయా మండలాల్లోని ప్రధాన కూడల్లో ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. దాన్యం కొనుగోలు కేంద్రాలను సందర్శిస్తూ.. సమస్యలు లేకుండా పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. రైతు పండుగ వేడుకలను వైభవంగా నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు.
పత్తి రైతులు సీసీఐకి పత్తి అమ్ముకునే విధంగా పూర్తిస్థాయిలో కమాన్ పూర్ పరిధిలో రైతులకు అవగాహన అవగాహన కల్పించాలని సిసిఐ వారు కల్పించే పత్తి మద్దతు ధర గూర్చి రైతులకు పోస్టర్ల ద్వారా కరపత్రాలు ద్వారా ఎలక్ట్రానిక్ సోషల్ మీడియా ద్వారా ప్రచారం నిర్వహించామని రైతులు తీసే సెంటర్లకు వచ్చి ప్రతిని అమ్ముకొనుచున్నారని తెలియపరిచాము కమాన్పూర్ పరిధిలో పరమేశ్వర కాటన్ అగ్రో ప్రోడక్ట్ గొల్లపల్లి జిన్నింగు మిల్లులో ప్రభుత్వ ఆదేశాల మేరకు పత్తి కొనుగోలు జరుగుతున్నాయనన్నారు వీటి పర్యవేక్షణ గురించి గౌరవం మాన్యశ్రీ వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మంత్రివర్యులు తుమ్మల నాగేశ్వరరావు పత్తి గోనుగుల నిర్వహణపై వీడియో కాన్ఫరెన్స్ పత్తి రైతులతో మా మార్కెట్ కమిటీ సిబ్బందితో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లారని రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ శాఖ డైరెక్టర్ ఆదేశాలు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరియు వరంగల్ ఆర్జేడి శ్రీనివాస సార్ ఆర్డిడి పద్మావతి మేడం ఆదేశాలు మరియుప్రతిరోజు పెద్దపెల్లి జిల్లా కలెక్టర్ గౌరవ కోయ శ్రీ హర్ష పర్యవేక్షణలో ఆదేశాలతో మరియు పెద్దపెల్లి డిస్టిక్ మార్కెటింగ్ ఆఫీసర్ ప్రవీణ్ రెడ్డి పర్యవేక్షణలో ప్రతిరోజు రైతుల ప్రతి చిన్న సమస్యకు ముందుండి పనిచేస్తున్నామని తెలిపారు.
కమాన్ పూర్ మార్కెట్ పరిధిలోని ఐకెపి సెంటర్లకు సొసైటీ పిసి సెంటర్లకుసెంటర్స్కు టార్ పోలీస్ కవర్స్ మాయిచ్చర్ మీటర్స్ ఎలక్ట్రానిక్ వే మిషన్ కొంటారు ప్యాడి క్లీనర్స్ కాలిబర్ మొదలగు వాటిని సప్లై చేశాము ధాన్యం కొనుగోలు నిమిత్తము సప్లై చేయడం జరిగిందని వెల్లడించారు.


