రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయండి.
Make the blood donation camp a success.తాడేపల్లిగూడెం.,
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, జనసేనాని కొణిదెల పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా తాడేపల్లిగూడెం శాసనసభ్యులు బొలిశెట్టి శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని అఖిల భారత చిరంజీవి యువత అధ్యక్షుడు స్వామి నాయుడు పిలుపునిచ్చారు. ఈ మేరకు హైదరాబాదులోని చిరంజీవి బ్లడ్ బ్యాంక్ నుంచి ఆయన ఒక వీడియో విడుదల చేశారు.తాడేపల్లిగూడెం అభిమానులతో పాటు జన సైనికులు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని మెగా అభిమానులు అందరూ పాల్గొని ఈ రక్తదాన శిబిరాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. రక్తదానం చేయండి ప్రాణదాతలు కండి అని మెగాస్టార్ చిరంజీవి నినాదాన్ని అందరూ పాటించి మెగా కుటుంబం చేస్తున్న సేవా కార్యక్రమంలో భాగస్వాములు కావాలన్నారు. పవన్ కళ్యాణ్ పుట్టినరోజున మీరు చేసే ఈ కార్యక్రమం ఆయనకు పుట్టినరోజుకు కానుక కానుంది అన్నారు.




