మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనాన్ని విజయవంతం చేయండి — రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్
వాయిస్ టుడే — నవంబర్ 1, 2025
జూబిలీహిల్స్ / షేఖ్ పెట్ దర్గా

మున్నూరు కాపుల ఏకతా, అభివృద్ధి, ప్రాతినిధ్యం బలోపేతం కోసం ఆదివారం హైదరాబాద్‌లో జరగనున్న “మున్నూరు కాపుల ఆత్మీయ సమ్మేళనం” విజయవంతం చేయాలని రాష్ట్ర ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ పిలుపునిచ్చారు.
శనివారం షేక్‌పేట్‌లో మున్నూరు కాపుల నాయకులు, యువత, మహిళా ప్రతినిధులతో ప్రత్యేక సమావేశం నిర్వహించిన ఆయన మాట్లాడుతూ —
“మన సమాజం రాజకీయంగా, ఆర్థికంగా బలపడాలి. రాష్ట్రవ్యాప్తంగా మున్నూరు కాపులు ఐక్యంగా ముందుకు రావాలి. ఎర్రగడ్డ డివిజన్ మూసాపేట్ పరిధిలోని మెజిస్టిక్ గార్డెన్స్‌లో ఆదివారం జరగనున్న ఆత్మీయ సమ్మేళనం ఈ దిశగా చారిత్రాత్మక మలుపు అవుతుంది” అని అన్నారు.
ఆయన కొనసాగిస్తూ, “ఈ సమావేశం ద్వారా మున్నూరుకాపుల ప్రగతి, విద్య, ఉద్యోగాలు, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలపై సమగ్ర చర్చ జరుగుతుంది. సమాజ బలపాటుకు ప్రతీ ఒక్కరూ హాజరై తమ వంతు పాత్ర పోషించాలి” అని పిలుపునిచ్చారు.
ఈ సమావేశంలో మున్నూరు కాపుల సంఘాల అధ్యక్షులు, యువ నాయకులు, మహిళా ప్రతినిధులు, ఐటీ, బిజినెస్ రంగాల ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం.
ఆత్మీయ సమ్మేళనం రేపు మధ్యాహ్నం 2 గంటలకు మెజిస్టిక్ గార్డెన్స్‌లో ప్రారంభం కానుంది. ఈ కార్యక్రమం లో మున్నూరుకాపు ప్రముఖులు గాలి అనిల్ కుమార్ , ,బొమ్మ శ్రీరామ్ చక్రవర్తి ,సత్తుమల్లేశం మున్నూరు కాపు నాయకులు పాల్గొన్నారు



