‘ఆస్మాన్’ మూవీ టీజర్ అంచనాలు పెంచేసిన మేకర్స్
Makers of the movie ‘Aasman’ have raised expectations with the teaser.
శ్రీమతి. కొండారు శ్రీనివాసరావు సమర్పణలో శ్రీ క్లీంకార సెల్యూలాయిడ్ బ్యానర్ మీద మేఘాంశ్ శ్రీహరి హీరోగా రామ్ నందన్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఆస్మాన్’. ఈ సినిమాని వెంకటేష్ కొండారు, శ్రీకాంత్ మన్నెం నిర్మిస్తున్నారు. శ్రీహరి జయంతి సందర్భంగా రిలీజ్ చేసిన మూవీ ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్‌కి మంచి స్పందన వచ్చింది. తాజాగా మేఘాంశ్ శ్రీహరి పుట్టిన రోజు సందర్భంగా బుధవారం నాడు టీజర్‌ను విడుదల చేశారు.
‘మీరు ఇప్పుడు గొంగలి పురుగు దశలో ఉన్నారు.. అది దాటి సీతాకోక చిలుక దశలోకి మారాలి.. దానికి మార్గం నేనే.. మీరందరూ కూడా కనిపించే చీకట్లో ఉన్నారు.. అదే నిజం’ అంటూ అద్భుతమైన డైలాగ్స్, హీరో వాయిస్ ఓవర్‌తో ఉన్న ఈ టీజర్ ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగింది. ఇక ఈ టీజర్‌లోని విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్, ఎమోషన్స్ అన్నీ కూడా ప్రేక్షకుల్ని కట్టి పడేసేలా ఉన్నాయి. అన్ని వర్గాల ఆడియెన్స్‌ని ఆకట్టుకునేలా కట్ చేసిన ఈ టీజర్‌లో హీరో మేఘాంశ్ శ్రీహరి సరికొత్తగా కనిపించారు.
ప్రశాంత్ ఆర్ విహారి మ్యూజిక్, షోయబ్ కెమెరా వర్క్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. ఇక ఈ మూవీని తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, అరబిక్ భాషల్లో విడుదల చేయనున్నారు.
తారాగణం : మేఘాంశ్ శ్రీ హరి, రాయంచ, రవివర్మ, కమల్, కేశవ్ దీపక్, నిఖిల్, రాజశేఖర్, పద్మిని, ప్రేరణ గ్యాంగ్, సంతోష్, రమణ, కుమార్, సత్యరాజ్ తదితరులు




