- Advertisement -
మంద కృష్ణ వ్యాఖ్యాలను తప్పుపట్టిన మాల విద్యార్దులు
Mala students wronged Manda Krishna's comments
హైదరాబాద్
మాల లకు రాజకీయ భవిష్యత్తు లేకుండా చేస్తాం,డిసెంబర్ 27 మీటింగ్ తరువాత మాలలకు చావు డప్పు కొడతాం అని మందకృష్ణ మాదిగ మాట్లాడడాన్ని ఆల్ మాల స్టూడెంట్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు మందాల భాస్కర్ తీవ్రంగా తప్పుపట్టారు.ఓయూ ఆర్ట్స్ కళాశాల వద్ద ఆల్ మాలా స్టూడెంట్స్ ఆధ్వర్యంలో పత్రిక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మందాల భాస్కర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం కోసం తమ గలాన్ని విప్పిన దళిత కళాకారులను కించపరిచే విధంగా మందకృష్ణ మాదిగ మాట్లాడటం చాలా బాధాకరం అన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడం కొరకు కిరణ్ కుమార్ రెడ్డి, చంద్రబాబు నాయుడు లతో చేతులు కలిపింది మందకృష్ణ మాదిగ అని మండిపడ్డారు.మాలలు మనువాదులు అంటూ మాల సామాజిక వర్గాన్ని కించపరిచే విధంగా మాట్లాడడం చాలా బాధాకరం అన్నారు.ఇప్పుడు బిజెపి పార్టీ తో జతకట్టి దళిత ఉద్యమాన్ని మళ్లీ నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.ఇక నైనా మాలలను కించపరిచే విధంగా మాట్లాడినట్లయితే మాలలను,దళిత వర్గాలను కలుపుకొని మరో ఉద్యమాన్ని చేపడుతామని హెచ్చరించారు.
- Advertisement -