Tuesday, January 14, 2025

మినీ ఎయిర్ పోర్టుగా మల్కాజ్ గిరి

- Advertisement -

మినీ ఎయిర్ పోర్టుగా మల్కాజ్ గిరి

Malkaz Giri as a mini airport

హైదరాబాద్, జనవరి 11, (వాయిస్ టుడే)
పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా హైదరాబాద్‌, సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్లపై ఒత్తిడి తగ్గించేలా జంట నగరాల పరిధిలోని రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు. ఇప్పటికే చర్లపల్లి టెర్మినల్‌ను అత్యాధునిక సౌకర్యాలతో అభివృద్ధి చేసి.. ప్రారంభించారు. ప్రస్తుతం సంక్రాంతి ప్రత్యేక రైళ్లు నడిపిస్తుండగా.. మార్చి నుంచి రెగ్యులర్ రైళ్లు ఈ స్టేషన్ నుంచే బయలుదేరేలా ఏర్పాట్లు చేస్తున్నారు. తాజాగా, సికింద్రాబాద్‌కు సమీపంలో ఉన్న మల్కాజిగిరి రైల్వేస్టేషన్‌‌ను అమృత్ భారత్ స్టేషన్ల పథకం (ఏబీఎస్ఎస్) కింద అభివృద్ధి చేస్తున్నారు. సకల వసతులతో దీని రూపురేఖలు మార్చేస్తున్నారు. సికింద్రాబాద్‌ స్కీంలో భాగంగా ఈ స్టేషన్‌ను ఎంపిక చేశారు. అభివృద్ధి పనుల చకచక జరుగుతున్నాయి.ఇప్పటికే 12 మీటర్ల వెడల్పుతో ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జి, మూడు లిప్టులు, మూడు ఎస్కలేటర్లు పనులు చేపట్టారు. ఇంద్వేల్‌ కాంట్రాక్ట్ సంస్థ ఆధ్వర్యంలో ఈ పనులు కొనసాగుతున్నాయి. స్టేషన్‌‌లో హై-లెవల్‌ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణ పనులు పూర్తికావస్తున్నాయి. వీఐపీ లాంజ్‌, ఏసీ వేయిటింగ్‌ హాల్‌, విశాలమైన పార్కింగ్‌ వసతి, రైల్వేస్టేషన్‌ రాకపోకలు సాగించేందుకు కొత్తగా అప్రోచ్‌రోడ్డు, స్టేషన్‌కు ఇరువైపులా ఆకర్షనీయంగా పోర్టికోల నిర్మాణం శరవేగంగా సాగుతున్నాయిగ్రీనరీతో కూడిన గార్డెన్లతో పాటు ‘ఐ లవ్‌ యూ మల్కాజిగిరి’ అనే సెల్ఫీ పాయింట్‌ను సైతం స్టేషన్ ముందు నిర్మాణం జరుగుతోంది. గత అక్టోబరు మొదలైన పనులు పూర్తయిన తర్వాత మల్కాజిగిరి రైల్వేస్టేషన్ రూపురేఖలు మారిపోనున్నాయి. ఈ స్టేషన్‌ మినీ ఏయిర్‌పోర్టుగా ప్రయాణికుల మన్ననలు పొందనుంది. ఇప్పటికే మహబూబ్‌నగర్- విశాఖపట్నం ఎక్స్‌ప్రెస్ వంటి కొన్ని రైళ్లకు అక్కడ స్టాప్ ఉంది. వీటితో పాటు మరికొన్ని ఎక్స్‌ప్రెస్‌ రైళ్లకు సైతం స్టాప్‌ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది.మల్కాజిగిరి రైల్వే స్టేషన్ ఆధునికీకరణ పనుల కోసం కేంద్రం బడ్జెట్‌లో రూ.27 కోట్లు కేటాయించినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు ఫ్లాట్‌పామ్‌ల మాత్రమే ఉండగా.. ప్రయాణికుల రద్దీని బట్టి మరొకటి అందుబాటులోకి తీసుకొస్తామని అధికారులు తెలిపారు. రోజూ ఈ మార్గంలో 62 రైళ్లు రాకపోకలు సాగిస్తుండగా… స్టేషన్‌లో 600 సాధారణ టిక్కెటుదారులు, 500 వరకు రిజర్వేషన్ ప్రయాణికులు ఈ స్టేషన్ నుంచి ప్రయాణిస్తున్నారు

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్