Monday, March 16, 2026

మల్లారెడ్డి… ఆయన కోడలు జోరుగా… హూషారుగా…

- Advertisement -

మల్లారెడ్డి… ఆయన కోడలు
జోరుగా… హూషారుగా…
హైదరాబాద్, మార్చి 16, (వాయిస్ టుడే )

Mallareddy… and his daughter-in-law—going strong… full of energy…
కొందరికి ఏజ్ పెరుగుతుంటే రకరకాల వ్యాధులు వస్తుంటాయి. మరికొందరికి ఏమో ఏజ్ పెరుగుతుంటే ఎక్కడా లేని ఉత్సాహం వస్తూ ఉంటుంది. పైగా యుక్త వయసులో ఉన్నప్పుడు చేయలేని పనులను ఈ ఏజ్ లో చేస్తుంటారు. ఈ జాబితాలో మాజీ మంత్రి మల్లారెడ్డి అలియాస్ పాల మల్లారెడ్డి ముందు వరుసలో ఉంటారు.పాలమ్మిన, పూలమ్మిన, కష్టపడ్డ, సక్సెస్ ఐన.. అని అప్పట్లో మల్లారెడ్డి చెప్పిన డైలాగ్ సోషల్ మీడియాను ఊపేసింది. ఆ తర్వాత ఆయన సోషల్ మీడియా స్టార్ అయిపోయారు. పూలమ్మిన.. పాలమ్మిన.. ఈ డైలాగ్‌ చెప్పగానే గుర్తొచ్చే పేరు.. మల్లారెడ్డి. టీడీపీలో రాజకీయం మొదలు పెట్టి.. బీఆర్‌ఎస్‌లో చేరిన చేమకూర మల్లారెడ్డి వ్యాపారంలోనూ, ఇటు రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్నారు. మోటివేటర్‌గా ఎంతో మందికి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన స్ఫూర్తితో వ్యాపారంలో రాణిస్తున్నారు మల్లారెడ్డి కోడలు ప్రీతిరెడ్డి. మల్లారెడ్డి వారసురాలిగా తనదైన గుర్తింపు తెచ్చుకున్న ప్రీతిరెడ్డి.. రాజకీయ వారసత్వాన్ని పునికిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశం గురించి రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చలు జరుగుతున్నాయి.మల్లారెడ్డి విద్యా సామ్రాజ్యంలో కీలకంగా పనిచేస్తున్న ప్రీతి రెడ్డి ఇటీవల సోషల్‌ మీడియా ద్వారా ఎలివేట్‌ అయ్యారు. ఈ సమావేశాల్లో ఆమె విద్యా మౌలిక సదుపాయాలు, ప్రాంతీయ అభివృద్ధి విషయాలతోపాటు ఆర్థిక అసమానతలు, దారిద్య్ర నిర్మూలన, స్త్రీల ఆర్థిక స్వాతంత్య్రం, యువతకు అవకాశాలు వంటి విస్తృత అంశాలపై చర్చించారు. ఆర్థికంగా వెనుకబడిన వర్గాలకు విద్యా, ఉపాధి అవకాశాలు పెంచాలని, సామాజిక న్యాయం అందించాలని స్పష్టంగా పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ఆమెను సామాన్యుల సమస్యలకు సున్నితంగా ఉన్న నాయకురాలిగా చిత్రీకరిస్తున్నాయి.ప్రీతి రెడ్డి ఇటీవల ఓ ఇంటర్వ్యూల్లో ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని కేంద్ర ప్రభుత్వ విధానాలను మెచ్చుకున్నారు. ముఖ్యంగా, కొత్త జాతీయ విద్యా విధానం (ఎన్‌ఈపీ 2020) ద్వారా విద్యా వ్యవస్థలో వచ్చిన మార్పులు, ఆర్థిక సంస్కరణలు, మహిళా సాధికారత కార్యక్రమాలు గురించి ఆమె ప్రశంసలు ఆకట్టుకున్నాయి. బీజేపీ పాలనలో దేశవ్యాప్త అభివృద్ధి, డిజిటల్‌ ఇండియా వంటి కార్యక్రమాలను ఆమె సమర్థించడం గమనార్హం. ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌కు బదులు జాతీయ పార్టీతో ఆమె భవిష్యత్తు లింక్‌ను సూచిస్తున్నాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశంపై జరుగుతున్న ఊహాగానాలపై మల్లారెడ్డి కుటుంబం స్పందించలేదు. ప్రతీరెడ్డి వ్యాఖ్యలను ఖండించలేదు. మల్లారెడ్డి కుటుంబం ఇప్పటికే తెలంగాణలో బలమైన రాజకీయ, విద్యా ప్రభావం కలిగి ఉంది. ప్రీతి రెడ్డి ప్రవేశం కుటుంబ ప్రభావాన్ని మరింత బలోపేతం చేస్తుందని అంచనా. రాబోయే స్థానిక ఎన్నికలు లేదా అసెంబ్లీ ఎన్నికల ముందు ఆమె అధికారిక ప్రవేశం జరిగే అవకాశం ఎక్కువ.ప్రీతిరెడ్డి రాజకీయ ప్రవేశం తెలంగాణలో కుటుంబ రాజకీయాలకు కొత్త డైమెన్షన్‌ ఇస్తుంది. బీఆర్‌ఎస్‌లోనే చేరినా, ఆమె జాతీయ విధానాల పట్ల ఆకర్షణ బీజేపీతో కూటమి ఏర్పడే సూచనలు ఉన్నాయి. తెలంగాణలో బీజేపీ ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో, ఆమె ప్రవేశం పార్టీకి కొత్త యువ, మహిళా ముఖాన్ని ఇస్తుంది.ఇక అప్పటినుంచి మల్లారెడ్డి ఏం మాట్లాడినా సరే.. ఏం చేసినా సరే సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతోంది. వాస్తవానికి మల్లారెడ్డి వయసు ఇప్పుడు ఏడు పదులు దాటింది. అయినప్పటికీ ఆయన యంగ్ గా కనిపిస్తున్నారు. ఉత్సాహానికి ప్రతీకగా దర్శనమిస్తున్నారు.మల్లారెడ్డి తన 50వ వివాహ వేడుకను ఘనంగా జరుపుకున్నారు. ఈ వేడుకను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ క్రమంలో నిర్వహించిన సంగీత్ వేడుకలో మల్లారెడ్డి అదరగొట్టారు. హుక్ స్టెప్పులతో అలరించారు. వయసు అనేది శరీరానికి మాత్రమేనని.. మనసుకు కాదని ఆయన నిరూపించారు. షేర్వాని ధరించి.. మెడలో గులాబీ కండువా వేసుకొని.. కళ్ళకు గాగుల్స్ తో అచ్చం మాస్ హీరో లాగా కనిపించారు మల్లారెడ్డి.మల్లారెడ్డి వేసిన స్టెప్పుల సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో విపరీతంగా సర్కులేట్ అవుతున్నాయి. “ఒక వయసుకు వచ్చిన తర్వాత శరీరం సహకరించదు. కానీ మల్లారెడ్డి విషయంలో ఇందుకు పూర్తి విరుద్ధం. ఆయనకు అన్ని సహకరిస్తున్నాయి. పట్టిందల్లా బంగారమవుతోంది. దేశవ్యాప్తంగా తన విద్యాసంస్థలను విస్తరిస్తున్నారు మల్లారెడ్డి. అంతటితోనే ఆగడం లేదు. 70 సంవత్సరాల వయసులో కూడా యువకుడి లాగా రెచ్చిపోతున్నారు. ఇది మామూలు విషయం కాదంటూ” నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్