- Advertisement -
మల్లారెడ్డి ఇంజనీరింగ్ క్యాంపస్ ఆహారంలో పురుగులు
విద్యార్దినిలు అందోళన
మేడ్చల్
హైదరాబాద్ శివారు మైసమ్మ గూడా లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ క్యాంపస్ లో విద్యార్థినిలు నిరసనకు దిగారు. సోమవారం రాత్రి అన్నం, ఇతర ఆహార పదార్థాల్లో పురుగులు వచ్చాయంటూ విద్యార్థినిలు క్యాంపస్ ఆవరణలో ఆందోళన చేపట్టారు. మల్లారెడ్డి విద్యాసంస్థల యాజమాన్యం తమకు నాణ్యమైన ఆహారం అందించట్లేదు అంటూ వాపోయారు. వుయ్ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలు చేశారు. కొద్ది రోజుల క్రితం కూడా ఇదే విద్యాసంస్థలో ఆహార భోజనంలో పురుగులు కలకలం రేపిన విషయం తెలిసిందే…
- Advertisement -