ఉపాధి హామీ పథకం లో పని చేస్తూ తీవ్ర అశ్వస్థ కు గురైన మాల మల్లేష్ మృతి
Mallesh died working in employment guarantee scheme
పార్థివదేహానికి నివాళి అర్పించి వివరాలు అడిగి తెలుసుకున్న గ్రామ పంచాయతీ సెక్రటరీ అధికారులు
యెమ్మిగనూరు
మండల పరిధిలో దైవందిన్నె గ్రామం లో ఉపాధి పనిలో భాగంగా గురువారం రోజు న మల్లేష్ పని చేస్తుండగా ఛాతి లో నొప్పి రావడం తో ఇంటికి వచ్చి తీవ్ర అశ్వస్థ కు గురి కావడం తో ఉటాహుటిన కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రి కి తీసుకోని వెళ్ళగానే అత్యవసర చికిత్స చేసి ఐ సి యు లో ఉంచి చికిత్స అందించారు. శుక్రవారం ఉదయం ఏడు గంటల సమయం లో నొప్పి తీవ్రతరం కావడం తో గుండెపోటు తో మరణించడం జరిగింది. శనివారం రోజు గ్రామ సచివాలయం సెక్రటరీ బసవరాజు గారు మరియు గ్రామ పెద్దలు మల్లేష్ పార్థివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులతో మాట్లాడి న్యాయం చేస్తామని అధికారులు తెలిపారు.మల్లేష్ కు నలుగురు సంతానం అందరు చిన్న పిల్లలు కావడం తో కుటుంబికుల వేదన తో దైవందిన్నె గ్రామం లో విషాదం ఛాయలు అలుముకున్నాయి.