

మూసాపేట్ :ఫిబ్రవరి 22(వాయిస్ టుడే)
నూతన భవన నిర్మాణానికి పాత నివాసాన్ని కూల్చుతున్న క్రమంలో వ్యక్తి మృతి చెందిన ఘటన కూకట్పల్లి మూసాపేట్ లో జరిగింది. పోలీసులు స్థానికులు తెలిపిన వివరాలు ప్రకారం మూసాపేట్ లో మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ తన పాత నివాసాన్ని తొలగించి భవన నిర్మాణానికి కూల్చివేతలు ప్రారంభించాడు. అంతకుముందు ఉదయం అద్దెకు ఉండే వారందరిని ఖాళీ చేయాలని తెలిపారు. స్వామి రెడ్డి అనే ఓ వ్యక్తి విషయం తెలియక మద్యం మత్తులో వచ్చి ఇంట్లో నిద్రించాడు. కూల్చివేతల నిమిత్తమై యజమాని కాంట్రాక్టర్ అప్పగించడంతో అతను ఎవరూ లేరని అనుకొని జే సి బి తో తొలగింపు పనులు ప్రారంభించాడు. శిథిలాల కింద ఓ వ్యక్తి ఉండడం, ఆర్తనాదాలు గమనించి చూడగా అప్పటికే మరనించడంతో.. మృతదేహాన్ని గాంధీకి తరలించారు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి చేస్తున్నారు




