అక్క మృతదేహంతో మూడు రోజులు
మేడ్చల్
జీడిమెట్ల పియస్ పరిధి చింతల్ లో ఓ ఇంట్లో ఖమ్మం కు సత్తుపల్లి, వెంకటరామపురం గ్రామానికి చెందిన ఓ కుటుంబం అమానవీయంగా ప్రవర్తించింది. ఇంట్లో చనిపోయిన మహిళ(40) శవంతోనే 3
రోజులుగా అదే ఇంట్లో సాధారణ జీవనం సాగించారు..
మృతురాలు రాధ (45) 20 సంవత్సరాల క్రితం భర్తతో విడాకులు తీసుకుంది.. ఆమె తమ్ముడు, చెల్లెలు ఇద్దరికి పెళ్లి కాలేదు.గత మూడురోజులు క్రితం రాధ అనారోగ్యంతో మృతిచెందింది.
మతి స్థిమితం లేని అన్న చెల్లెలు అక్క మృతదేహానికి అంత్యక్రియలు చేయకుండ ఇంట్లోనే ఉన్నారు. దీంతో ఇంట్లో నుండి తీవ్ర దుర్వాసన రావడంతో పక్కింటివారు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో
ఈ సంఘటన వెలుగులోకి వచ్చింది..కుటుంబీకుల మతిస్థిమితం సరిగ్గా లేకనే విషయం బయటకు రాలేదని అనుమానించిన పోలీసులు మృతదేహాన్ని తరలించి కేసు నమోదుచేసుకొని దర్యాప్తు
చేస్తున్నారు..



