- Advertisement -
యువకుల దాడిలో వ్యక్తి మృతి
Man dies in youth attackరాజన్న సిరిసిల్ల
వేములవాడలో యువకుల దాడిలో గాయపడిన రాజేందర్ (29) వరంగల్ ఎంజీఎంలో చికిత్స పొందుతు మృతి చెందాడు. భగవంతరావు నగర్ కాలనీ లో అనుమానితులుగా భావించి ఈనెల 15న ఇద్దరిని గమద్యం మత్తులో ఉన్న యువకులు చితకబాదారు. దాడిలో మంచిర్యాలకు చెందిన శంకర్, రాజేందర్ కు గాయాలు అయ్యాయి. ఇద్దరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ రాజేందర్ శనివారం మృతి చెందాడు. మృతుడుమంచిర్యాల జిల్లా జెండా వెంకటాపురం గ్రామానికి చెందిన వ్యక్తి. దాడిలో గాయపడి చికిత్స పొందుతు ఒకరు మృతి చెందడంతో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దాడి చేసిన నలుగురు యువకులు పరారీలో వున్నారు.
- Advertisement -




