Saturday, February 14, 2026

350 కోట్లను దాటేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు

- Advertisement -

350 కోట్లను దాటేసిన ‘మన శంకరవరప్రసాద్ గారు
హైదరాబాద్, జనవరి 28, (వాయిస్ టుడే )

‘Mana Shankaravara Prasad Garu’ crosses 350 crores
మెగాస్టార్ చిరంజీవి హోల్సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘మన శంకరవరప్రసాద్ గారు’ మూడవ వారంలో కూడా బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. ఈ చిత్రం ఇప్పుడు బుక్‌మైషోలో, ప్రపంచవ్యాప్త వసూళ్లలో సంచలనాత్మక మైలురాళ్లను సాధించింది.మన శంకరవరప్రసాద్ గారు బుక్‌మైషోలో ఆల్‌టైమ్ నంబర్ 1 రీజినల్ ఫిల్మ్ గా నిలిచింది, 15వ రోజుకే 3.6 మిలియన్ టికెట్లు అమ్ముడై, ఇప్పటివరకు రికార్డు కలిగిన సంక్రాంతికి వస్తున్నాం (3.5 మిలియన్)ను అధిగమించింది. ఈ ఘనతను సాధించిన ఫాస్టెస్ట్ రీజినల్ ఫిల్మ్  రికార్డ్ క్రియేట్ చేసింది.ప్రపంచవ్యాప్తంగా మన శంకరవరప్రసాద్ గారు  కేవలం 15 రోజుల్లో ₹358 కోట్లకు పైగా వసూలు చేసి ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ ఆల్‌టైమ్ బ్లాక్‌బస్టర్ గా నిలిచింది. ఉత్తర అమెరికాలో, ఈ చిత్రం $3.5 మిలియన్ల మార్కును దాటే దిశగా దూసుకుపోతోంది. మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్‌లోనే హైయెస్ట్ రికార్డ్స్ నమోదు అవుతున్నాయి. ఇప్పటికే వీరిద్దరికీ ఇదే బిగ్గెస్ట్ గ్లోబల్ ఎర్నర్ గా నిలిచింది.మన శంకరవరప్రసాద్ గారు ఆల్-టైమ్ రీజినల్ ఇండస్ట్రీ బ్లాక్‌బస్టర్‌తో మెగాస్టార్ చిరంజీవి తన బాక్సాఫీస్ స్టామినా ఏమిటో మరోసారి నిరూపించారు.ఈ చిత్రం అనేక చారిత్రాత్మక మైలురాళ్లను సాధించింది:
నార్త్ అమెరికాలో చిరంజీవి & అనిల్ రావిపూడి కెరీర్‌లో ఆల్‌టైమ్ హైయెస్ట్ ప్రీమియర్ గ్రాసర్.
తెలుగు రాష్ట్రాల్లో డే 5, డే 7, డే 14 నాటికి ఇండస్ట్రీ హైయెస్ట్ గ్రాసింగ్ రికార్డ్స్
కేవలం 6 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్ సాధించి, డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు భారీ లాభాలు
అనిల్ రావిపూడికి ఇది వరుసగా రెండో రీజినల్ ఇండస్ట్రీ హిట్, మొత్తం మీద 9వ కంటిన్యూస్ బ్లాక్‌బస్టర్.షైన్ స్క్రీన్స్, గోల్డ్ బాక్స్ ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌లపై సాహు గారపాటి, సుస్మిత కొణిదెల ఈ చిత్రాన్ని అత్యున్నతంగా నిర్మించారు.ప్రస్తుతం కొనసాగుతున్న స్ట్రాంగ్ మోమెంటంతో మన శంకరవరప్రసాద్ గారుథియేట్రికల్ రన్ ముగిసే సరికి ₹400 కోట్ల మార్క్‌ను దాటడం ఖాయం.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్