- Advertisement -
వనపర్తి జిల్లా కేంద్రంలోని దళితవాడలో ఈ మధ్యకాలంలో MSF జాతీయ ఉపాధ్యక్షులు గద్వాల కృష్ణ మాతృమూర్తి గద్వాల సవరమ్మ అనారోగ్యం కారణంగా స్వర్గస్తురాలైన విషయం తెలుసుకున్న ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ ఆదివారం వనపర్తి పట్టణంలోని గద్వాల కృష్ణ నివాసానికి విచ్చేసి కీర్తిశేషులు గద్వాల సవరమ్మ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి, ప్రగాఢ సంతాపం తెలిపారు.
ఈ కార్యక్రమంలో మంద కృష్ణ తో పాటు ఎమ్మార్పీఎస్ సీనియర్ నాయకులు కేశవులు,MEF రాష్ట్ర నాయకులు గంధం గట్టయ్య, గంధం నాగరాజు sc,st విజిలెన్స్ మానిటరింగ్ సభ్యులు, హెల్త్ డిపార్ట్మెంట్ గంధం రత్నయ్య, మహాజన పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షులు డి.రవిప్రసాద్ తదితరులు పాల్గొని ఆ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు
- Advertisement -



