Thursday, May 21, 2026

విధిగా హెల్మెట్ ధరించండి..హెల్మెట్ ధరించండి..సురక్షితంగా గమ్యంచేరండి..

- Advertisement -

విధిగా హెల్మెట్ ధరించండి..హెల్మెట్ ధరించండి..సురక్షితంగా గమ్యంచేరండి..

Mandatory wear helmet..Wear helmet..Have a safe destination..

హెల్మెట్ ధరించకపోతే ఉపేక్షించొద్దు.
.
హెల్మెట్ భారం కాదు..అది మన బాధ్యత..

హెల్మెట్ ధారణ అవగాహన బైక్ ర్యాలీలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి..

వాహనాలు నడిపే ప్రతిఒక్కరూ విధిగా హెల్మెట్, సీటు బెల్ట్ ధరించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి అన్నారు.  రోడ్డు భధ్రతా మాసోత్సవాల్లో భాగంగా మంగళవారం రవాణాశాఖ ఆధ్వర్యంలో ఏలూరులో చేపట్టిన బైక్ ర్యాలీని స్ధానిక పోలీస్ పెట్రోల్ బంకు వద్ద జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి)తో కలిసి ప్రారంభించారు.  ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. శ్రద్ధ వహించండి అనే నినాధంతో రోడ్డు భధ్రతపై నెలరోజులపాటు ప్రతిరోజు వివిధ రూపాల్లో అవగాహన కలిగించే అంశాలపై రోడ్డు భధ్రతా మాసోత్సవాలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ప్రతినెలా జిల్లాస్ధాయిలో రోడ్డుభధ్రతపై సమావేశాలు, కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతున్నాయని చెప్పారు. జిల్లాలో ఏడాది కాలంలో 595 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 290 మంది మరణానికి గురికాగా మరో 628 మంది క్షతగాత్రుల
య్యారన్నారు. వీటిని దృష్టిలో పెట్టుకొని ముఖ్యంగా ద్విచక్ర వాహనచోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా రోడ్డు భద్రత నిబంధనల మేరకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టామన్నారు.  హెల్మెట్ ధరించని వారిపై అపరాధరుసుం విధించబడుతుందని ఆయా పరిస్ధితులను బట్టి వారి 3 నెలల పాటు డ్రైవింగ్ లైసెన్సులు కూడా రద్దుచేయడం జరుగుతుందన్నారు. హెల్మెట్ ధరించాల్సిన అవసరం, ధరించకుండా సంభవించే దుష్ప్రభావాలపై వాహనచోధకుల్లో అవవగాన కలిగించడం జరుగుతుందన్నారు. మొదటిసారిగా వెయ్యిరూపాయలు జరిమాన కలెక్టరేట్ తోపాటు అన్ని ప్రభుత్వ శాఖల్లో ద్విచక్రవాహనం కలిగిన ప్రతి ఉద్యోగి హెల్మెట్ ధరించి కార్యాలయాలకు హాజరు కావాలని ఇప్పటికే ఆదేశించామన్నారు.

ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య(చంటి) మాట్లాడుతూ హెల్మెట్ ధరిస్తే రోడ్డు ప్రమాదాల సమయంలో ప్రాణాప్రాయం నుంచి బయటపడ వచ్చన్నారు. రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువగా తలకు గాయాలతో మరణాలు సంభవిస్తున్నట్లు గణంకాలు తెలుపుతున్నాయని దీనిని దృష్టిలో ఉంచుకొని వాహనచోధకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించి వాహనం నడపాలన్నారు. ప్రస్తుతం వాహనాల సంఖ్య పెరిగి ట్రాఫిక్ రద్దీ ఎక్కువకావడంతో రోడ్డు ప్రమాదాలు కూడా పెరుగుతున్నాయని ఈ దృష్ట్యా ప్రజల్లో హెల్మెట్ వినియోగంపై అవగాహన కలిగించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  మొదటి సారిగా అపరాధరుసుం విధించాలని తదుపరి అదే తప్పుచేస్తే వారి లైసెన్సు అధికారులు రద్దుచేస్తారన్నారు.  మైనర్లకు తల్లిదండ్రులు వాహనాలు ఇవ్వకూడదని సూచించారు.
ఈర్యాలీలో నగరపాలక సంస్ధ కో-ఆప్షన్ సభ్యులు ఎస్.ఎం.ఆర్. పెదబాబు, ఇన్ చార్జి ఉప రవాణా కమీషనరు కె.ఎస్.ఎం.వి. కృష్ణారావు, ఏలూరు ఆర్డిఓ అచ్యుత అంబరీష్, ఏలూరు డిఎస్పీ డి. శ్రావణ్ కుమార్, డిఎంహెచ్ఓ డా. మాలిని, అధనపు డిఎంహెచ్ఓ డా. నాగేశ్వరరావు, సాయిస్వర్ణ హోండా షోరూం అధినేత సోమేశ్వరరావు, పలువురు పోలీస్, రవాణా శాఖ అధికారులు పాల్గొన్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్