Tuesday, January 27, 2026

మేనిఫెస్టోలోని కీలక అంశాలతో జాతీయ స్థాయిలో మేనిఫెస్టో  

- Advertisement -

తెలంగాణ మేనిఫెస్టోలోని కీలక అంశాలతో జాతీయ స్థాయిలో మేనిఫెస్టో  
హైదరాబాద్, జనవరి 24
టీపీసీసీ మేనిఫెస్టో కమిటీ సమావేశం చైర్మన్, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు అధ్యక్షతన గాంధీ భవన్ లో సమీక్ష సమావేశం జరిగింది.  ఎన్నికల ముందు ఒక మంచి ఎన్నికల మేనిఫెస్టో అందించగలిగాము.. రాష్ట్రంలో అన్నింటికంటే మంచి మేనిఫెస్టో ఇవ్వగలిగామమని శ్రీధర్ బాబు తెలిపారు.   మేనిఫెస్టోలో ఆరు గ్యారంటీలు ఇచ్చాం.. అధికారంలోకి రాగానే ఆరు గ్యారంటీలు అమలు చేసే దిశగా అడుగులు వేస్తున్నాం అని ఆయన పేర్కొన్నారు. రెండో రోజు మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, ఆరోగ్య శ్రీలో పది లక్షల ఆరోగ్య పథకాన్ని అందించాము.. ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను అమలు చేస్తామన్నారు. ప్రజలు కాంగ్రెస్ పార్టీ పై ఎంతో విశ్వసాన్ని చూపారు.. ప్రతిపక్ష పార్టీ చేస్తున్న విమర్శలు చాలా తొందరపాటుగా ఉన్నాయి.. వారు చేస్తున్న విమర్శలను పట్టించుకుంటే పనులు జరగవని తెలిపారు. ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం కృషి చేస్తోంది అని తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. మేనిఫెస్టో అంటే ప్రజలకు దగ్గరగా, అమలుకు నోచుకునే విదంగా ఉండాలని  ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి అభిప్రాయపడ్డారు.  తెలంగాణ లో మంచి మేనిఫెస్టో అందించారు. అందుకే తెలంగాణ ప్రజలు విశ్వసించారన్నారు.  ఏఐసీసీ మేనిఫెస్టో కేంద్ర మాజీ మంత్రి చిదంబరం గారి నేతృత్వంలో రూపొందుతుందని..  మ్యానిఫెస్టో పబ్లిక్ ఫ్రెండ్లీ గా ఉండాలి.  క్రోని కాపిటల్ కు దూరంగా ప్రజావసరాలకు దగ్గరకు ఉండాలన్నారు.  తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో సహకారం తీసుకుంటామని తెలిపారు. తెలంగాణ మేనిఫెస్టోపై జాతీయ కాంగ్రెస్ నాయకుల్లో పాజిటివ్ టాక్ నడుస్తోంది. దేశవ్యాప్తంగా ఇదే విధానాన్ని ప్రచారం చేయాలని ప్రపోజల్ పెట్టడం జరిగింది. నాలుగైదు కామన్ స్కీములతో పాటు, రాష్ట్రాల కోసం ప్రత్యేక అంశాలను మేనిఫెస్టోలో పెట్టాలని కాంగ్రెస్ నిర్ణయించింది.  అన్ని రాష్ట్రాల్లో తిరిగి కేంద్ర మేనిఫెస్టో కమిటీ అభిప్రాయాలను సేకరిస్తోంది. అందులో భాగంగానే  తెలంగాణ నుంచి మేనిఫెస్టో కమిటి అభిప్రాయాల సేకరణ జరపింది.మేనిఫెస్టో కమిటీ   సమావేశంలో ఏఐసీసీ ఇంచార్జ్ దీపదాస్ మున్శితో పాటు ఏఐసీసీ ప్రొఫెషనల్ కాంగ్రెస్ చైర్మన్ ప్రవీణ్ చక్రవర్తి, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ చౌదరీ, మన్సూర్ అలీ ఖాన్, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్, మేనిఫెస్టో కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ మేనిపెస్టోలోని అంశాలు జాతీయ మేనిఫెస్టోలోనూ ఉండే అవకాశాలు ఉన్నాయి.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్