Thursday, January 16, 2025

ప్రాణాలు తీస్తున్న మంజా…

- Advertisement -

ప్రాణాలు తీస్తున్న మంజా…

Manja taking life...

హైదరాబాద్, జనవరి 10, (వాయిస్ టుడే)
చైనా మాంజా.. ఇది సాధారణ దారం కంటే గట్టిగా, పదునుగా ఉండటంతో ప్రమాదాలు జరుగుతున్నాయి. దీన్ని.. నైలాన్, సింథటిక్‌ దారానికి గాజు, ప్లాస్టిక్‌ పొడి పూసి మాంజా తయారు చేస్తారు. గాజుముక్కలను ఇతర రసాయన విషాలను కలపడం వల్ల ఈ దారం కత్తిలాగా మారుతోంది. అదే ఇప్పుడు మనిషి పాలిట ఉరితాడుగా మారింది.  2017లోనే చైనా మాంజా ఉత్పత్తి, నిల్వ, అమ్మకాలపై జాతీయ హరిత ట్రిబ్యునల్‌ నిషేధం విధించింది. ఈ దారం పర్యావరణానికి ప్రమాదమని భావించిన జాతీయ హరిత ట్రైబ్యునల్‌తో పాటు రాష్ట్ర ప్రభుత్వం నిషేధం విధించింది. అయినా సంక్రాంతికి చైనా మాంజా విక్రయాలు ఇష్టారీతిన సాగుతున్నాయి. గతంలో ఇతర రాష్ట్రాల నుంచి రహస్యంగా తీసుకొచ్చి విక్రయించేవారు. ప్రస్తుతం ఆ వ్యాపారం లాభసాటిగా ఉండటంతో ఎక్కడపడితే అక్కడ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.ఈ చైనా మాంజా కారణంగా ప్రతి సంక్రాంతి సమయంలో ఎంతో మంది చనిపోతున్నారు. తీవ్రంగా గాయపడిన వారు ఆసుపత్రుల పాలవుతున్నారు. ఈ మాంజాతో పతంగులు ఎగురవేసే వారికి కూడా అనేక గాయాలవుతున్నాయి. అయినా మార్కెట్‌లో మాత్రం చైనా మాంజా విక్రయానికి మాత్రం అడ్డుకట్ట పడటం లేదు. పోలీసులు సోదాలు చేసి కేసులు నమోదు చేస్తున్నా ఫలితం లేకుండాపోతోంది. తెలుగు రాష్ట్రాల్లో ఇటీవల చాలామంది.. గాయపడ్డ ఘటనలు నమోదయ్యాయి. ఈ దుస్థితి నెలకొనడానికి కారణం అధికారుల నిర్లక్ష్యం, వ్యాపారుల అత్యాశ, పతంగులు ఎగురవేసే వారి బాధ్యతారాహిత్యం అని చెప్పాలి.చైనీస్ మాంజా కారణంగా పక్షుల మరణాలకు లెక్కేలేదు. గాలి పటాలు ఎగరేసినప్పుడు తెగిపోయిన మంజా దారాలు చెట్లు, కరెంట్‌ తీగలు, స్తంభాలు, ఇళ్ల మధ్య వేలాడుతూ ఉంటాయి. పక్షులు ఎగిరివచ్చి వాటిలో చిక్కుకుపోయి మృత్యువాతపడుతున్నాయి. అందులో అరుదైన పక్షులు ఉంటున్నాయని, మాంజా కారణంగా కొన్ని జాతులు అదృశ్యమైపోవాల్సిన పరిస్థితి ఏర్పడుతోందని జంతు ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముఖ్యంగా బైక్స్‌ మీద వెళ్లేవారికి ఈ మాంజా కారణంగా ముప్పు ఏర్పడుతుంది. అందుకే కొందరు వాహనదారులు ప్రత్యామ్నాయ దారులను అన్వేశిస్తున్నారు. తాజాగా గుజరాత్‌లో ఓ వాహనదారుడు.. చైనా మాంజా ముప్పు నుంచి తప్పించుకునేందుకు తన స్కూటీకి ముందు ఓ ఇనుప కడ్డీతో షీల్డ్‌లా ఏర్పాటు చేసుకున్నాడు. మా బాధను ఎవరూ అర్థం చేసుకోవడం లేదు. మాంజా తగిలితే ప్రాణం పోవడం ఖాయం. అందుకే ఈ ఏర్పాటు అంటున్నాడు. ఈ ఐడియా బాగుందని.. ఫాలో అయితే బెటర్ అని చాలామంది నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు.

- Advertisement -

RELATED ARTICLES

spot_img

Most Popular

error: Content is protected !!
telegram ban in india Sanjay Roy is the accused who revealed the real truth in the court. భగవంతుని ప్రసాదం తీర్థం..తులసీదళం లేకుండా అసంపూర్ణం కేజీఎఫ్ సినిమాతో పాన్ ఇండియా స్టార్ హీరోయిన్‏గా శ్రీనిధి శెట్టి. Upasana: భర్తపై రివెంజ్ తీర్చుకున్న ఉపాసన.. పాపం రామ్ చరణ్