- Advertisement -
మన్మోహన్ సింగ్ మృతి తీరని లోటు
Manmohan Singh's death is an irreparable loss
కూకట్ పల్లి
ప్రముఖ ఆర్థికవేత మాజీ ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్ మృతి తనని ఎంతో కలచివేసిందని కూకట్ పల్లి కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షుడు శేరి సతీష్ రెడ్డి అన్నారు. ఆయన మృతికి సంతాపంగా శనివారం తన కార్యాలయంలో మన్మోహన్ సింగ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన్మోహన్ సింగ్ మరణంతో దేశం ఓ గొప్ప నాయకుడు నీ కోల్పోయిందని ఆర్థిక మంత్రిగా ఉన్నప్పుడు దేశంలో ఆర్థిక సంస్కరణలు శ్రీకారం చుట్టిన గొప్ప నాయకుడని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావానికి ఎంతో కృషి చేసిన గొప్ప నాయకుడు మన్మోహన్ సింగ్ అని కొనియాడారు.
- Advertisement -