- Advertisement -
మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం
Manmohan Singh's services are memorable
మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి
జగిత్యాల,
మాజీ ప్రధాని
మన్మోహన్ సింగ్ సేవలు చిరస్మరణీయం ఆని జగిత్యాల
మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి -లక్ష్మణ్ కొనియాడారు..
దేశ ఆర్థిక సంస్కరణల రూపశిల్పి మన్మోహన్ సింగ్ మృతి పట్ల జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్ ఆడువాల జ్యోతి లక్ష్మణ్ విచారణ వ్యక్తం చేశారు.ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి ప్రార్థిస్తున్నానని అన్నారు.శుక్రవారం ఈ సంధర్భంగా జగిత్యాల ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో డాక్టర్ సంజయ్ కుమార్ ఆదేశాల మేరకు మాజీ ప్రధామంత్రి మన్మోహన్ సింగ్ చిత్రపటానికి జగిత్యాల మున్సిపల్ చైర్ పర్సన్, కౌన్సిలర్స్ పూలమాలవేసి నివాళులర్పించారు.ఈ సందర్భంగా మున్సిపల్ చైర్ పర్సన్ మాట్లాడుతూ
ప్రధానమంత్రి పీవీ నరసింహారావు ఆధ్వర్యంలో ఆర్థిక మంత్రిగా, ఆధునిక మరియు ప్రగతిశీల భారత్‌కు పునాది వేసిన మైలురాయి లాంటి ఎల్‌పీజీ, లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, సంస్కరణలను ఆయన ప్రవేశ పెట్టారన్నారు.
పీవీ, మన్మోహన్ ధ్యేయం దేశాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి కాపాడిందని, స్థిరత్వాన్ని పునరుద్ధరించారన్నారు. వారు ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలే ప్రపంచంలో మన దేశం తలెత్తుకుని నిలబడేలా చేశాయిని. యూపీఏ ప్రభుత్వంలో ప్రధానమంత్రిగా ఉన్న సమయంలో డాక్టర్ మన్మోహన్ సింగ్.. మహాత్మా గాంధీ, జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్ఆర్ఈజీఏ), సమాచార హక్కు చట్టం (ఆర్‌టీఐ), విద్యా హక్కు వంటి మైలురాయి కార్యక్రమాలను ప్రవేశపెట్టారన్నారు. ఇది మిలియన్ల మంది జీవితాలను తాకిందన్నారు.
ఆయన మేధస్సు, చిత్తశుద్ధి, ప్రజా సేవ పట్ల అంకితభావం దేశాభివృద్ధికి అవిశ్రాంతంగా పనిచేసిన నాయకుడిగా ఆయనను నిలబెట్టాయిని, మన్మోహన్ సింగ్ పనితనం తరతరాలకు స్ఫూర్తినిస్తూనే ఉంటుందని మున్సిపల్ చైర్పర్సన్ అన్నారు.ఈ కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగభూషణం,రాయికల్ మున్సిపల్ చైర్మన్ మోర హనుమాన్లు, కౌన్సిలర్లు బాలే లత శంకర్,శ్రీలత రామ్మోహన్ రావు ,దాసరి లావణ్య ప్రవీణ్,కూతురు పద్మ శేఖర్,బద్దం లత జగన్,పద్మావతి పవన్, క్యాదాసు నవీన్,
నాయకులు వీరబత్తిని శ్రీనివాస్, ప్రభాత్ సింగ్ ఠాగూర్,రామకృష్ణ రెడ్డి,రంగు మహేష్, చిట్ల మనోహర్,
,తదితరులు పాల్గొన్నారు.
- Advertisement -