- Advertisement -
మ్యానరిజం మార్చిన పుష్స 2
Mannerism Changed Pushsa 2
పాట్నా, నవంబర్ 18, (వాయిస్ టుడే)
న్నో రోజుల ఎదురు చూపులకు ఫుల్ స్టాప్ పెడుతూ “పుష్ప 2” ట్రైలర్ ఎట్టకేలకు రిలీజ్ అయింది. “పుష్ప అంటే ఫైర్ అనుకుంటివా.. వైల్డ్ ఫైర్” అంటూ అల్లు అర్జున్ మరోసారి ట్రైలర్లో అదరగొట్టారు. ఇక ట్రైలర్ ఇలా రిలీజ్ అయ్యిందో లేదో అలా రికార్డులను బ్రేక్ చేసుకుంటూ వెళ్తోంది. అయితే ఈ నేపథ్యంలోనే మరోవైపు ట్రైలర్ ను లెక్కలేనన్ని సార్లు చూస్తూ, అందులో ఉన్న హైలెట్స్ ఏంటో, సీక్రెట్స్ ఏంటో కనిపెడుతున్నారు మూవీ లవర్స్. అందులో భాగంగానే ట్రైలర్ ను సరిగ్గా గమనిస్తే అల్లు అర్జున్ తన మ్యానరిజం మార్చుకున్నట్టుగా కనిపిస్తోంది.“పుష్ప అంటే ఫ్లవర్ అనుకుంటావా.. ఫైరు” అంటూ మొదటి పార్ట్ లో అల్లు అర్జున్ చెప్పిన డైలాగ్ అందరికీ తెగ నచ్చేసింది. అలాగే ఆయన మ్యానరిజం కూడా బాగా ఆకట్టుకుంది. సెకండ్ పార్ట్ లో కూడా ఇలాంటి మ్యానరిజంతోనే పుష్ప రాజ్ తన స్వాగ్ కంటిన్యూ చేస్తాడేమో అని అనుకున్నారు. కానీ తాజాగా రిలీజ్ అయిన ట్రైలర్ చూస్తుంటే ఈసారి మరో కొత్త మ్యానరిజంతో పుష్ప రాజ్ ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నట్టు అనిపిస్తోంది. ‘పుష్ప 2’ ట్రైలర్లో అల్లు అర్జున్ తన చేతికున్న వాచ్ మరింత టైట్ అయ్యే విధంగా, చేతిని పైకి లేపి హ్యాండ్ తిప్పడం ఎక్కువసార్లు కనిపించింది. అంటే కచ్చితంగా ఈసారి అల్లు అర్జున్ మొదటి పార్ట్ లో ఉన్న మ్యానరిజంతో పాటు మరో కొత్త మేనరిజంతో థియేటర్లలో ప్రేక్షకులను అలరించబోతున్నాడు. ట్రైలర్ తో పాటు ఇప్పుడు అల్లు అర్జున్ కొత్త మ్యానరిజం కూడా బాగా వైరల్ అవుతుంది. మరి మీరు కూడా ఈ విషయాన్ని గమనించారా?ఇదిలా ఉండగా అల్లు అర్జున్ ‘పుష్ప 2’ ట్రైలర్ తోనే ఎన్నో రికార్డులను బ్రేక్ చేయడంతో పాటు సరికొత్త చరిత్రను సృష్టించారు. రిలీజ్ అయిన 24 గంటల్లోపే 40 మిలియన్లకు పైగా వ్యూస్ సొంతం చేసుకున్న మొట్ట మొదటి సౌత్ ఇండియా మూవీగా చరిత్రను సృష్టించింది ‘పుష్ప’. అలాగే ఈ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు భారీ సంఖ్యలో హాజరయ్యారు జనాలు. ‘పుష్ప 2’ మూవీ ట్రైలర్ రిలీజ్ ఈవెంట్ బీహార్ రాజధాని పాట్నాలోని గాంధీ మైదాన్‌లో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఇప్పటి వరకు సౌత్ లో ముఖ్యంగా నార్త్ లో ఏ నటుడికి రాని విధంగా, ఒక తెలుగు హీరో సినిమా వేడుకకు 2 లక్షల మందికి పైగా ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరయ్యారు. నిజంగానే ఇదొక అరుదైన ఫీట్ అని చెప్పవచ్చు. ఇంతకుముందు ఈ రికార్డు షారుఖ్ ఖాన్ పేరిటా నమోదు అయ్యింది. ఇప్పుడు 2.6 లక్షల మంది ‘పుష్ప 2’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ కు హాజరు కావడంతో షారుఖ్ రికార్డు గల్లంతయ్యింది. అలాగే ఇండియన్ సినిమా చరిత్రలో ఫాస్టెస్ట్ 100 మిలియన్ వ్యూస్ సాధించిన సినిమాగా మరో కొత్త రికార్డును క్రియేట్ చేశాడు పుష్ప రాజ్.
- Advertisement -