జాతీయ కరాటే పోటీల్లో మంథని జపాన్ హిటోరియో కరాటే విద్యార్థుల ప్రతిభ
Manthani Japan's Hitorio Karate students talent in national karate competitions
-అభినందించిన సినీ హీరో సుమన్
మంథని , నవంబర్ 23:
జాతీయ కరాటే పోటీల్లో మంథని జపాన్ హిటోరియో కరాటే విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి బహుమతులు గెలుపొందగా సినీ హీరో సుమన్ వారిని అభినందించారు.
కరీంనగర్ లోని అంబేద్కర్ స్టేడియంలో సినీ నటుడు కృష్ణంరాజు స్మారకార్థం నిర్వహించిన జాతీయ కరాటే పోటీల్లో కరాటే శిక్షకులు కావేటి సమ్మయ్య కాయ్ రిఫరీ కమిషన్ ఆధ్వర్యంలో జపాన్ షీటర్ యు కరాటే అకాడమీ విద్యార్థులు సబ్ జూనియర్స్ కథ మరియు కుమితి విభాగాల్లో అత్యంత ప్రతిభ కనబరిచి బంగారు వెండి కాంస్య పథకాలు సాధించారు.
బంగారు పథకాలను తులసి గారి సాయి సహస్ర, వి అతిధి,అట్టెం రాఘవ లు
వెండి పతకాలను జడగాల మనస్విని,
కాంస్య పథకాలను సుంకరి లక్ష్మీ ప్రియ, ఐలి సౌమ్యత్య, గంధం లక్ష్మీ ప్రసన్న, అట్టెం రక్షిత్ రానా, బండారి మణికంఠ,బెజ్జంకి అక్షయ్ కీర్తన్, పోగుల శివసాకేత్, మారేడు కొండ రిషి, సుంకరి భరద్వాజ్ లు పథకాలు సాధించారు.
పథకాలు సాధించిన విద్యార్థులను సినీ హీరో సుమన్ తల్వార్, జపాన్ సితోరియో కరాటే జాతీయ ఉపాధ్యక్షులు పి పాపయ్య, కార్య నిర్వహణ అధ్యక్షులు గుంటుపల్లి సమ్మయ్య, కాయ్ రాష్ట్ర అధ్యక్షులు ఇప్ప శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి బి నరేందర్, కోశాధికారి సాయికుమార్,గౌరు రాజిరెడ్డి,ప్రసన్న సంపత్,ఇన్స్ట్రక్టర్స్ కావేటి శివ గణేష్, నాగలి రాకేష్,జడగాల శివాని, మెట్టు హాసిని లు అభినందించారు.