మంథని: బీసీ బిడ్డని మంథని ఎమ్మెల్యేగా గెలిపించుకోవాలని బహుజన సేవా రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకే యాదవ్, బీసీ సంఘాల జిల్లా జేఏసీ అధ్యక్షుడు పిల్లి శేఖర్ లు పిలుపునిచ్చారు. బుధవారం మంథని పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా బహుజన వాదాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే క్రమంలో, మంథనిలో బహుజన వాదాన్ని ముందుకు తీసుకు వెళుతున్న బీసీ లీడర్ పుట్టమధుకు తమ మద్దతు తెలుపుతున్నామన్నారు మంథని నియోజకవర్గంలో అత్యధిక శాతం బీసీ జనాభా కలిగి ఉన్నందున, ఇప్పుడు మనకు పుట్ట మధు రూపంలో ఒక సువర్ణ అవకాశం దొరికినందున ఆయనను ఎమ్మెల్యేగా గెలిపించి చట్టసభల్లోకి పంపి బహుజన వాదాన్ని గెలిపియాలని వారు కోరారు . ఇప్పుడు మన రాష్ట్రంలో జరుగుతున్న అసెంబ్లీ ఎన్నికల్లో బీసీలకు తక్కువ శాతం లో వివిధ పార్టీల అవకాశం కల్పించాయన్నారు. బీసీ వ్యక్తులు ఎక్కడ పోటీచేసిన తమ మద్దతు ఉంటుందని , వాటిలో మంథనిలో పుట్ట మధుకు ముఖ్యమంత్రి కేసీఆర్ అవకాశం కల్పించడంతో బీసీలంతా ఏకమై ఆయనను గెలిపించి మన బీసీ వాదాన్ని ముందుకు తీసుకువెళ్లాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో బహుజన సేన రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ మెంబర్ ప్రసాద్ గౌడ్, బీసీ సంఘం నాయకులు పెద్దపల్లి మధుకర్, శేఖర్,సమ్మన్న, జక్కుల సతీష్, రెడ్డి శేఖర్,తదితరులు పాల్గొన్నారు.



