- Advertisement -
కొడంగల్ లో పలు అభివృద్ది కార్యాక్రమాలు
Many developMany development programs in Kodangalment programs in Kodangal
రంగారెడ్డి
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సొంత నియోజకవర్గమైన కొడంగల్ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది.. 40 కోట్ల రూపాయలు ప్రభుత్వ నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు జరిగాయి…వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజక వర్గంలో మాజీ ఎమ్మేల్యే …రాష్ర్ట పోలీసు హౌసింగ్ సొసైటీ కార్పొరేషన్ చైర్మన్ గురునాథ్ రెడ్డి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి ముఖ్యమంత్రి సోదరుడు తిరుపతి రెడ్డి IG సత్యనారాయణ అధికారులతో కలిసి వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కొడంగల్ లో 23 కోట్ల 45 లక్షల వ్యయంతో నిర్మించే మహాత్మ జ్యోతిబాపూలే బాలుర గురుకుల అదనపు భవన పనులకు భూమి పూజ అదేవిధంగా 8 కోట్ల 80 లక్షల వ్యయంతో దుద్యాల మండల సమీకృత భవన నిర్మాణానికి శంకుస్థాపన, హకీం పేటలో 78 లక్షల వ్యయంతో సమీకృత పాఠశాల, జూనియర్ కాలేజ్, ఐటీఐ కు సంబంధించిన ప్రహరీ గోడ నిర్మాణానికి, 7 కోట్ల సిఎస్ఆర్ నిధులతో నిర్మించనున్న ఉన్నత పాఠశాల, కళాశాల భవనానికి శంకుస్థాపనతో పాటు హస్నాబాద్ జిల్లా పరిషత్ నూతన భవనానికి శంకుస్థాపనలు చేశారు. అదేవిధంగా తాత్కాలిక భవనంలో దుద్యాల పోలీస్ స్టేషన్ ప్రారంభోత్సవంతో పాటు హకీంపేటలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని వారు ప్రారంభించారు.
- Advertisement -