స్వాతంత్ర0 మాజన్మ హక్కు అన్న ఎందరో దేశభక్తులు అమరులయ్యారు
-అయ్యప్ప సేవకుడు,
యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు జనగామ తిరుపతి జ్యోతినగర్
Many patriots were martyred for freedom or birthright
ఆగస్ట్ 15 : స్వాతంత్య్ర పోరాటంలో స్వాతంత్ర్యం మాజన్మ హక్కు అని నినదించి ఎందరో దేశభక్తులు అమరులయ్యారు అని అయ్యప్ప సేవకుడు , యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు జనగామ తిరుపతి అన్నారు. ఈ మేరకు ఎన్టీపీసీ లోని ప్రభుత్వ మండల పరిషత్ ప్రాదమిక పాఠశాలలో జరిగిన 78వ స్వాతంత్ర్య దినోత్సవం కార్యక్రమంలో పాల్గొని జెండావందనం చేసి అనంతరం మాట్లాడారు. స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఎందరో మహనీయుల పోరాటాలు, మరెందరో బలిదానాల ఫలితంగా భారత దేశానికి స్వాతంత్ర్యము దక్కింది అని అన్నారు. భారత స్వాతంత్ర్య పోరాటం శాంతియుత మార్గంలో నడుస్తూనే భగత్ సింగ్, సుభాష్ చంద్రబోస్ లాంటి ఎంతో మంది దేశ భక్తులు ఆంగ్లేయులపై యుద్ధం ప్రకటించి తిరుగు బాటు చేసి దేశప్రజానికినికి దిక్సూచి అయ్యారు అని పేర్కొన్నారు. స్వాతంత్ర్య పోరాట త్యాగధనులను ఆదర్శంగా తీసుకుని వారి బాటలో నడుస్తూ దేశభక్తిని పెంపొందించడమే మనం అర్పించే ఘన నివాళి అని అయ్యప్ప సేవకుడు , యువరత్న పబ్లిక్ వెల్ఫేర్ సొసైటి అధ్యక్షుడు జనగమ తిరుపతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రాదమిక పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్ధిని విద్యార్థులు, అంగన్వాడి టీచర్, ఆయా మరియు తల్లితండ్రులు పాల్గొన్నారు




